Breaking News

21/08/2019

పవన్ కళ్యాణ్ పై కనిపించని ఒత్తిడి

న్యూఢిల్లీ, ఆగస్టు 21, (way2newstv.in)
మీ పార్టీని మా పార్టీలో విలీనం చేసేయండి. తద్వారా ఒక కేంద్ర మంత్రి పదవి మీ అన్నలాగే అందుకోండి. లేకపోతే రాబోయే పరిణామాలను మీరు తట్టుకోలేరు. ఆలసించిన ఆశాభంగం. ఇది ఒక జాతీయ పార్టీ జనసేనకు ఇస్తున్న బంపర్ ఆఫర్ ప్లస్ హెచ్చరిక. ఎపి, తెలంగాణ లో మంచి ఓటు బ్యాంక్ వున్న జనసేన ను తమ పార్టీలో విలీనం చేసుకుని బలపడాలన్నది ఆ జాతీయ పార్టీ ఆలోచన. ఇవన్నీ నిన్న మొన్నటి ఎన్నికల వరకు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ తరువాత ఈ విషయాన్నీ అంతా మరిచిపోతున్న సమయంలో జనసేన అధినేత మళ్ళీ పాత వ్యవహారాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది.ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చూశాకా ఇప్పుడు బిజెపి ట్రై చేస్తే జనసేన తమతో కలవకుండా ఎందుకు పోతుందని అంచనా వేస్తుందని అంటున్నారు. 
పవన్ కళ్యాణ్ పై కనిపించని ఒత్తిడి

అయితే బహిరంగంగా కాకుండా పవన్ తో సన్నిహితంగా వుండేవారితో ముందుగా మాట్లాడుతూ కమలం పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పవన్ మాత్రం పైకి చాలా సీరియస్ అవుతున్నారు. జనసేన పార్టీని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్కూల్ మూసేది ఉండదని గతంలోనే జనసేన అధినేత స్పష్టం చేశారు. అధికారం కోసం కాదు పాతికేళ్ళ వరకు పోరాటమే తమ లక్ష్యం ఆశయం అంటూ పవన్ ప్రకటించేశారు కూడా. 2014 లోనే అమిత్ షా ఎన్నికలు ముగిసాకా జనసేనను బీజేపీలో విలీనం చేసేయమన్నారని కానీ నేను అన్నలాంటి స్టెప్ వేయమని పదేపదే పవన్ స్పష్టం చేసేవారు.ఇక అక్కడితో ఆ ఎపిసోడ్ ఆయన ఆపలేదు. ఇటీవల తిరిగి ఈ తరహా కామెంట్స్ చేస్తూ బిజెపి నుంచి వత్తిడి తీవ్రమౌతున్నట్లు పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ముందు తాను కావాలనుకుంటే కేంద్రమంత్రి అయిపోగలను అంటూ వ్యాఖలు చేసి జనసేన ఉంటుందా కమలం లో కలిసి పోతుందా అన్న సందేహాలకు తెరతీశారు. మళ్ళీ ఏమైందో ఏమో తిరిగి ఈ విలీనం అంశాన్ని జనసేనాని ప్రస్తావించడం వెనుక గట్టి వ్యూహమే దాగివుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది ఏమిటి అన్నది త్వరలోనే తేలిపోతుందని అప్పటివరకు పైకి చెబుతున్న మాటలకు లోపల జరిగే అంశాలకు సంబంధం లేదని అంతా అర్ధం చేసుకుంటారని రాజకీయ వర్గాల్లో సైతం చర్చ నడుస్తుండటం 

No comments:

Post a Comment