Breaking News

06/08/2019

చెరువులను మింగుతున్న భూబకాసురులు చెరువు శిఖం భూముల్లో వెంచర్లు గా మారుతున్న వైనం

సంగారెడ్డి ఆగస్టు 6 (way2newstv.com - Swamy Naidu )
జిల్లా పరిధిలోని కల్వకుంట కు సంబంధించిన చెరువులను అక్రమంగా కబ్జా చేసి వెంచర్లు చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు పచ్చటి పంట పొలాలను ప్లాట్లుగా మార్చి కోట్లు దండుకుంటున్నారు ఎలాంటి అనుమతులు లేకుండానే  అడ్డగోలుగా వెంచర్ లు ఏర్పాటు చేస్తున్నారు.. ప్లాట్లు చేయాలంటే నియమ నిబంధనలు ఉన్నాయివ్యవసాయ భూముల్లో ప్లాట్లు చేయాలంటే నిబంధనల ప్రకారం ముందుగా వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పిడి లాంన్డ్ కాన్వర్ షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వెంచర్ ఏర్పాటు కోసం చండీ నుంచి అనుమతులు పొందాక వెంచర్లు నిర్వహించాలి.


 చెరువులను మింగుతున్న భూబకాసురులు   చెరువు శిఖం భూముల్లో వెంచర్లు గా మారుతున్న వైనం
అయితే కొంత మంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా  ప్లాట్లు చెసి యథేచ్ఛగా దందా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి పరిధిలో చాలా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి అవి ఎఫ్ టి ఎల్ పరిధిలోకి వస్తాయి  .ఆ చెరువుల ను కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారుల ది  కానీ అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉండడం గమనార్హం. వాలిచ్చే కాసులకు అలవాటుపడి అక్కడ చూసిన పాపాన పోలేదు. ఇప్పటికే సంగారెడ్డి లో త్రాగునీటి కష్టాలు వచ్చాయి చెరువులు మొత్త ము నిర్వీర్యంఅయిపోయాయి. కట్టలను తొలగించి ప్లాట్లుచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకనైనా  పై అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

No comments:

Post a Comment