Breaking News

05/08/2019

బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ ఆగస్టు 03 (way2newstv.in):
11 వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆబ్కారి,క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ  25 రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ఛాంపియన్ షిప్ పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 
 బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడల అభివృద్ధి కి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. దేశంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో నెంబర్ వన్ గా నిలిచామన్నారు. అలాగే క్రీడా రంగంలో కూడా నెంబర్ వన్ గా నిలిచేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సెట్విన్ ఛైర్మన్ ఇనాయత్ అలీ భాక్రి, థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ నిర్వాహకులు ఇప్తాకర్ హుస్సేన్, సౌరభ్ సుమన్ ఝా లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment