Breaking News

17/08/2019

తెలంగాణలో ప్రతీ స్కీమ్ వెనుక ఓ స్కామ్ ఉంది: లక్మణ్

హైదరాబాద్ ఆగష్టు 17 ఆగష్టు 17 (way2newstv.in):
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ స్కీమ్ వెనుక ఓ స్కామ్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్మణ్ ఆరోపించారు. శనివారం ఉదయం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో గ్రానైట్ పేరుతో దోచుకుంటున్నారంటున్నారు. అవినీతిలో దేశంలోనే నెంబర్ 2స్థానంలో తెలంగాణ ఉందని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కల్లకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు."కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని తెలంగాణాకు విముక్తి కలిగిస్తామన్నారు.ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు డబ్బు చెల్లింపులు లేవు. 
  తెలంగాణలో ప్రతీ స్కీమ్ వెనుక ఓ స్కామ్ ఉంది: లక్మణ్

కొత్త సచివాలయం నిర్మించే బదులు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు డబ్బులు ఇవ్వొచ్చుకదా..?. కళ్యాణలక్మీ, షాదీముబారక్ డబ్బులు లేవు. జీవో నెంబర్ 66తో టీఆర్ఎస్ పార్టీకి అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. దళితులకు మాత్రం మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కలర్ సినిమా చూపిస్తున్నారు. ఇంటర్ బోర్డులో తప్పిదాలు ప్రభుత్వ నిర్లక్ష్యమే. 27 మంది విద్యార్థుల మృతికి ప్రభుత్వమే కారణం. ఇంటర్ బోర్డుకు సంబంధించిన కుట్ర ప్రభుత్వానిదే. లోపాలను విమర్శిస్తే కుట్ర అంటారా ? కుట్ర మాదా మీదా..? కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణాకు విముక్తి కలిగిస్తాం. బీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే అప్డేటెడ్ ప్రభుత్వం వస్తుంది. విమర్శిస్తే తెలంగాణ ద్రోహులు లేదంటే తెలంగాణ వాదులా..? బొందుగాళ్లు అన్న కేసీఆర్ మాటలకు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పారు. కాళేశ్వరానికి జాతీయ హోదాపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. జాతీయ హోదా ఇస్తే కమీషన్లు రావని, అవినీతి బయటపడుతుందని డీపీఆర్ ఇవ్వకుండా డ్రామా ఆడుతున్నారు" అని లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు

No comments:

Post a Comment