Breaking News

23/08/2019

కోడెల ఇంట్లో కంప్యూటర్ చోరీ

గుంటూరు, ఆగస్టు 23 (way2newstv.in):
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ ఫర్నీచర్‌‌ను ఆయన సొంత ఆఫీసులో వాడుకున్నారని విమర్శలు రావడం, అవసరమైతే డబ్బులు చెల్లిస్తానని ఆయన వివరణ ఇవ్వడం తెలిసిందే. ఫర్నీచర్ తీసుకెళ్లాలని, లేదంటే దానికి తగిన డబ్బులు తీసుకెళ్లాలని కోడెల తెలిపారు.  అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటికి వచ్చి ఫర్నిచర్ తీసుకెళ్లబోతున్నారు. వారు కోడెల ఇంటికి వెళ్లడానికి ముందు.. ఆయన నివాసంలో దొంగతనం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటాక గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంట్లో దొంగతనం జరిగింది. 
కోడెల ఇంట్లో కంప్యూటర్ చోరీ 

ఆయన ఆఫీస్ రూంలో ఉంచిన రెండు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేయడం కోసమని ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి దాటాక కోడెల నివాసంలోకి వెళ్లారు. అనంతరం ఇంట్లోని కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మెన్‌పై దాడి చేసి కంప్యూటర్లతో పరారయ్యారు. కాగా, ఓ కంప్యూటర్‌ను అక్కడే వదిలేసి వెళ్లారని, ఉదయం వచ్చి మరో కంప్యూటర్‌ను గోడ పక్కన పడేసి వెళ్లారని సమాచారం. అందులోని డేటాను చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఫర్నీచర్ తీసుకెళ్లడం కోసం పోలీసులు కోడెల నివాసానికి వెళ్లడానికి ముందు ఈ చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది అంబటి మనిషే చోరి ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంట్లో చోరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లు దొంగతనం చేసింది వైసీపీ వ్యక్తేనని కోడెల ఆరోపణలు చేశారు. కరెంటు పని కోసమంటూ వచ్చి కంప్యూటర్లు ఎత్తుకెళ్లారన్నారు. అర్జున్ అనే వ్యక్తి ఇంట్లో చొరబడి వాచ్‌మెన్‌ను తోసుకుంటూ లోపలికి ప్రవేశించాడన్నారు. అర్జున్ గతంలో తమ దగ్గర పని చేశాడని, ఇప్పుడు అంబటి రాంబాబు వద్ద పని చేస్తున్నాడన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఎమ్మెల్యే అంబటి చోరీ విషయంపై స్పందించాలని కోడెల డిమాండ్ చేశారు. రాంబాబు అనుమతి లేకుండా అర్జున్ వచ్చే అవకాశం లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను బతకనివ్వడం లేదని, వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఫర్నిచర్ గుంటూరులో భద్రంగా ఉందన్నారు. అర్జున్ కంప్యూటర్లు ఎందుకు తీసుకెళ్లాడో తెలియాలని, అతని వెనుక ఎవరున్నారో బయటకు లాగాలన్నారు. తనపై కక్షతోనే వైఎస్సార్సీపీ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నిచర్‌కు సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment