Breaking News

23/08/2019

వరుస తప్పిదాలతో అమర్ నాధ్ రెడ్డి...

కడప, ఆగస్టు 23, (way2newstv.in - Swamy Naidu)
మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. ఆయన బెంగుళూరులోని తన వ్యాపార కార్యక్రమాలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ ల మధ్యనే ఎక్కువగా అమర్ నాధ్ రెడ్డి తిరుగుతున్నారు. అమర్ నాధ్ రెడ్డి వాస్తవంగా వైసీపీలోనే ఉండేవారు. 2009లో టీడీపీ నుంచి, 2014 ఎన్నికల్లోనూ అమర్ నాధ్ రెడ్డి వైసీపీ తరుపున విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత తిరిగి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.అమర్ నాధ్ రెడ్డి టీడీపీ నేతగానే అందరికీ తెలుసు. ఆయన పొలిటికల్ క్యాలిక్యులేషన్లు అన్నీ రాంగ్ అవుతున్నాయి. 2009లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అమర్ నాధ్ రెడ్డి భావించారు. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 2014లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని భావించి అమర్ నాధ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. కానీ అప్పుడు కూడా అమర్ నాధ్ రెడ్డి లెక్కలు తప్పాయి. 
వరుస తప్పిదాలతో అమర్ నాధ్ రెడ్డి...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీీపీ టిక్కెట్ మీద గెలిచినా అమర్ నాధ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోవాల్సి వచ్చింది. కేవలం అధికారం మాత్రమే కాకుండా మంత్రి పదవి కూడా దక్కింది.నిజానికి అమర్ నాధ్ రెడ్డి వైసీపీలో కొనసాగి ఉంటే పలమనేరు నుంచి ఖచ్చితంగా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవారు. అయితే మంత్రి అయ్యేవారు కాదట. ఈ విషయాన్ని అమర్ నాధ్ రెడ్డి అనుచరులే బహిరంగంగా చెబుతున్నారు. వైసీపీలో ఉన్నా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం హవా ఉంటుందని, అమర్ నాధ్ రెడ్డికి పార్టీలో కొనసాగి ఉన్నా ఇప్పుడు మంత్రి పదవి దక్కేది కాదంటున్నారు. పెద్దిరెడ్డి నీడలో అమర్ నాధ్ రెడ్డి పార్టీలో ఎదగలేరనే అమర్ నాధ్ రెడ్డి వైసీపీలోకి వచ్చారన్నది ఆయన అనుచరుల వాదన.ఇప్పుడు టీడీపీకి కూడా భవిష్యత్తు లేదన్న నిర్థారణకు అమర్ నాధ్ రెడ్డి వచ్చారట. వరసగా అధికారంలోకి తాను వస్తుందనుకున్న పార్టీ రాలేకపోతుండటంతో ఈసారి ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. టీడీపీలో కొనసాగి వృధా అన్నది అమర్ నాధ్ రెడ్డి అభిప్రాయమని తెలుస్తోంది. అయితే ఇప్పుటికప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏడాది జగన్ పాలన చూసిన తర్వాత అడుగులు వేయవచ్చన్నది అమర్ నాధ్ రెడ్డి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అమర్ నాధ్ రెడ్డి క్యాలిక్యులేషన్లు ప్రతి ఎన్నికకూ తప్పవుతుండటంతో ఈసారి కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జిల్లాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. ఓవైపు రాష్ర్టంలో వైసీపీ అధికారంలోకి రావడం, ఇతరత్రా వ్యక్తిగత విషయాలతో రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించాలంటే, బీజేపీలో చేరడమే మార్గమని ఆదినారాయణరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే బిజేపిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించారట మాజీ మంత్రి ఆది. అయితే, పరిస్థితులు పెద్దగా అనుకూలించలేదని వినికిడి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ బిజేపిలో చేరిపోయారు. రాజకీయంగా సిఎం రమేష్‌తో పెద్దగా పొసగదు ఆదికి. అయినా బిజేపిలో చేరే ప్రయత్నాలు మానుకోలేదట ఆదినారాయణ రెడ్డి. కొద్దికాలం క్రితం దివంగత వైఎస్ఆర్ ప్రియ శిష్యుడిగా కొనసాగిన మాజీ డిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత బిజేపి నాయకుడు మాకం అశోక్ కుమార్ ద్వారా, బిజేపి రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మరో బిజేపి నేత, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం. ఈ ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే, బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను, ఆది కలిశారన్న ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటి ద్వారా ఆది బిజేపిలో చేరిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. త్వరలోనే బిజేపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటనలో ఆదినారాయణరెడ్డి, కమలం తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాకు చెందిన పలువురితో ఆర్బాటంగా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరికకు, రంగం సిద్దం చేసుకుంటున్నట్లు ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. అయితే జగన్‌పై ఎన్నికల ముందు ఒంటికాలిపై లేచిన ఆదినారాయణరెడ్డి, బిజేపిలో చేరిన తర్వాత, మళ్లీ అదే వైఖరిని కంటిన్యూ చేస్తారా అన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టిడిపిలో చేరిన నాటి నుంచి ప్రతినిత్యం హాట్‌హాట్ కామెంట్స్‌తో ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి, ఇప్పుడు బిజేపిలో చేరిన తర్వాత వైఎస్ జగన్‌పై ఎలాంటి కామెంట్స్‌ ఎక్కుపెడతారు, టిడిపిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. చూడాలి ఆది అడుగులు ఎటువైపు పడతాయో ఎలాంటి వాగ్భాణాలు దూసుకొస్తాయో. 

No comments:

Post a Comment