Breaking News

21/08/2019

హైద్రాబాద్ లో ఆమెజాన్ కార్యాలయం ప్రారంభం

హైద్రాబాద్, ఆగస్టు 21 (way2newstv.in - Swamy Naidu
హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్‌ క్యాంపస్ ను రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీ ప్రారంభించారు. అనంతరం అక్కడ మహముద్‌ అలీ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో అమెజాన్‌ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, సంస్థ స్థిరాస్తి, వసతుల మేనేజర్‌ జాన్‌ స్కోట్లర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారుప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ నిర్మాణానికి 2016 మార్చిలో అప్పటి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలోనే సుమారు పది ఎకరాల స్థలంలో, 15 అంతస్థుల్లో ఈ కార్యాలయం నిర్మాణం పూర్తయింది. 
హైద్రాబాద్ లో ఆమెజాన్ కార్యాలయం ప్రారంభం
అత్యంత అధునాతన సదుపాయాలతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. సుమారు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 10 లక్షల చదరపు అడుగులను కేవలం పార్కింగ్ స్థలానికే కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి అమెజాన్ సంస్థ సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టింది. ప్రసుత్తం అమెజాన్ సంస్థలో ఏడు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నూతన కార్యాలయంతో సెప్టెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 9 వేలకు చేరుతుంది. పరోక్షంగా 15 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈ కార్యాలయం నుంచే అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యలకలాపాలను నిర్వహించనుంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు, కొత్త సాఫ్ట్‌వేర్‌ల రూపకల్పన, వ్యాపార విస్తరణ తదితర ముఖ్య కార్యకలాపాలన్ని ఇక హైదరాబాద్ అమెజాన్ కేంద్రం నుంచే నిర్వహిస్తుంది. వాస్తవానికి అమెజాన్ సంస్థ దశాబ్దం క్రితమే హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీన్నే 2020 చివరి నాటికి 5.8 లక్షల చదరపు అడుగులకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ అన్ని వసతులకు అనుకూలంగా ఉండటంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు అందిస్తుండటంతో అమెజాన్ తన ప్రపంచ స్థాయి కార్యకలాపాల కోసం అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయ నిర్మాణానికి పూనుకుంది. ఈ క్యాంపస్ నిర్మాణంతో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ కీర్తి మరింత పెరగనుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఆపిల్, ఐబీఎం, ఒరాకిల్‌ లాంటి అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యాలయాలను ఏర్పాట చేసి, వేల మందికి ఉపాధి కల్పస్తున్నాయి. వీటితోపాటు ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌ మహేంద్ర కూడా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా అమెజాన్ క్యాంపస్ ఏర్పాటుతో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 

No comments:

Post a Comment