అదిలాబాద్, ఆగస్టు 07, (way2newstv.in)
నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) సాంకేతిక విద్యకు పెద్దపీట వేయాలని యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతల్లో యువతీ,యువకులకు సాంకేతిక విద్యను అందించడానకి ఐటిఐలను ప్రోత్సహంచాలని ప్రణాళికలను రూపొందిస్తోంది. సాంకేతిక విద్యలో నైపుణ్యత సాధించిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామిక వేత్తలతో వర్క్‌షాప్‌లను చేపట్టాలని సూచిస్తోంది. దేశ వ్యాపితంగా 4800 ఐటిఐలను రెండు విడతుల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వనున్నది.
ఐటీఐలను దత్తత నేషనల్ మైనింగ్ కార్పొరేషన్
సాంకేతిక విద్యను అందించే కళాశాలలకు గ్రేడింగ్ (మార్కులు)తో ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలను అందివ్వాలని చెబుతోంది. ఈ విధానంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యువతకు ఉపయోగపడతాయని జాతీయ కౌన్సిల్‌కు నివేదికను అందించింది. సాంకేతిక సంస్థలు శిక్షణా సమయంలో 43 అంశాలకు చెందిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. వౌళిక సదుపాయలను కల్పించడంలో ఐటిఐలు ప్రాధాన్యత ఇవ్వాలని, అలా చేయకపోవడంతో ఐటిఐలో చదువుతున్న విద్యార్థులు (డ్రాప్ అవుట్) మధ్యలోనే విద్యను మానుకోవడం జరుగుతోందని వెల్లడించింది.దీంతో యువత నిరాశల్లో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌ఎమ్‌డిసి ముఖ్య ఉద్ధేశ్యం గ్రామీణ యువతకు గనులు,స్టీల్ రంగాల్లో నైపుణ్యాన్ని వెలికితీయడమేనని చెబుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో జీవణ బృతికి అనుకూలంగా ఉపాధి పనులు బోరు పంపుల రిపేరి, వాటి పర్యవేక్షణతో పాటు సాంప్రదాయంగా వచ్చే చేతి వృత్తులపై యువతకు శిక్షణ ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ వోకేషనల్ ట్రైనింగ్ సంస్థకు సిఫార్స్ చేసింది.
No comments:
Post a Comment