పెద్దపల్లి ఆగస్టు 20 (way2newstv.in - Swamy Naidu):
మత్స్యకారుల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్టమధుకర్ అన్నారు. మంగళవారం రోజున ఆయన సిరిపురంలోని సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలో చేప పిల్లలను విడిచి పెట్టారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోన్న జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు మాట్లాడుతూ రాష్ట్రంలోని కులవృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా మత్స్యకారులను ప్రోత్సహించటానికి సబ్సీడిలో వారికి అవసరమైన వాహనాలు, వలలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మత్స్య పరిశ్రమను పెంపొందించే దిశగా నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వనరుల పై సంబంధిత మత్స్య సంఘాలకు పూర్తి స్థాయిలో హక్కు కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని జడ్పీ చైర్ పర్సన్ అన్నారు.
మత్స్యకారుల అభివృద్దికి కృషి - జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు
సుందిళ్ల (పార్వతి ) బ్యారేజిలో 12 లక్షలకు పైగా చేపపిల్లలను పెంచడానికి ప్రణాళిక సిద్దం చేసామని, ప్రస్తుతం 1,82,600 చేప పిల్లలను చేప పిల్లలను పంపిణీ చేసామని, వీటిలో కట్ల, మ్రీగాల్, రోహుల్ వంటివి ఉన్నాయని తెలిపారు. 2 లక్షలకు పైగా రొయ్యలను సైతం పెంపొందించేందుకు ప్రణాళిక సిద్దం చేసామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నీటి వనరులతో పాటు నూతనంగా నిర్మించే ప్రాజెక్టులలో సైతం నీలి విప్లవం తలపించేలా చేపల పెంపకం రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజేక్టు, ఇతర గోదావరి ప్రాజేక్టుల నిర్మాణంతో సుమారు 500 టిఎంసిల వినియోగం అదనంగా రాష్ట్రంలో ఉంటుందని, వీటిలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం వల్ల మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్గతుందని అన్నారు. కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో పనులు పూర్తి చేయడం వల్ల రైతులతో పాటు మత్స్యకారులకు లాభం కల్గుతుందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలలో 365 రోజులు నీరు అందుబాటులో ఉంటుందని, ఇక్కడ టూరిజం సైతం పెంపొందించేలా ప్రణాళికలు సిద్దం చేసామని, వాటి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి లాభం చేకురుతుందని అన్నారు. మన ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని, చేపలను ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేయాలని ఆ దిశగా కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ తెలిపారు. మత్స్య శాఖ సూపర్ వైజర్ హన్మంత్ రావు, జడ్పీటిసి, సిరిపురం సర్పంచ్, ఎంపిటిసి , సంబంధిత అధికారులు, మత్స్యకారులు, తదితరులుbj ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
No comments:
Post a Comment