Breaking News

08/08/2019

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ పై కేంద్రం నిఘా

కడప, ఆగస్టు 8, (way2newstv.in)
గ్రామాల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నిధులను కేటాయిస్తోంది. పరిశుభ్రత.. మరుగుదొడ్లు కీలకం.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌లో పల్లెల పరిశుభ్రత ప్రధానాంశం. ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి, దాని సద్వినియోగం, పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ, నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు ఉండాలి. పరిశీలన బృందానికి స్వచ్ఛ పల్లె, ఆరోగ్య పల్లె కళ్ల ముందు కనిపించాలి.కనీస మౌలిక వసతులకు ఖర్చు చేయాలని సూచిస్తోంది. పలు గ్రామాల్లో పనులు చేయకనే నిధులు మింగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నిధుల ఖర్చుపై కేంద్రం దృష్టి సారించింది. 
స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ పై కేంద్రం నిఘా

గ్రామాల్లో సర్వే చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని గ్రామాల్లో ఆయా బృందం పర్యటించి వివరాలు సేకరించి నివేదికలు అందజేయనున్నారు. జిల్లాలోని 50 మండలాల్లో 9 మేజరు, 781 చిన్న గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో సుమారు 28 లక్షల మందికిపైగా జనాభా నివాసం ఉంటున్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు  విడుదల చేస్తోంది. ప్రధానంగా ఆర్థిక సంఘం నిధులు అధికశాతం పంచాయతీలకు నేరుగా  చేరుతున్నాయి. ఈ నిధులు ఎంత మేర సద్వినియోగమవుతున్నాయి? పారిశుద్ధ్యం, తాగునీరు ఇతర వసతులు ప్రజలకు చేరుతున్నాయా? లేదా? అనే విషయాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో కొనసాగిన ‘స్వచ్ఛత’ పోటీ ఇప్పుడు గ్రామాల్లోనూ జరగనుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను తాజాగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ జిల్లా కేంద్రాలకు పంపింది. పరిశుభ్ర ఆరోగ్య గ్రామాలే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచనతో స్వచ్ఛత అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలన్న సదాశయంతో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం మొదలైంది. దేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు సగానికంటే ఎక్కువగా ఉండటం, ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరతను గుర్తించి ఇప్పుడు ఈ పోటీని వాటికి కూడా విస్తరింప చేశారు.అన్ని కోణాల్లో పరిశీలన.. స్వచ్ఛ సర్వేచ్ఛ గ్రామీణ్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సర్వేలో భాగంగా అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి జిల్లాలోని పంచాయతీల్లో పర్యటిస్తారు. ఈ నెల 31 వరకు సర్వేను బృందం సభ్యులు చేపట్టనున్నారు. వీరు ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, అభివృద్ధి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి అక్కడి ప్రజలతో మాట్లాడి నివేదిక తయారుచేస్తారు. ఒక్కో అంశానికి మార్కులు, ర్యాంకులు సైతం కేటాయిస్తారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, వాటి బిల్లుల పరిస్థితి, ఆర్థిక సంఘం నిధులు ఎలా వ్యయం చేస్తున్నారో తెలుసుకుంటారు. నిధులు దుర్వినియోగం జరిగితే ఏమైనా చర్యలు తీసుకున్నారా అని పరిశీలిస్తారు.

No comments:

Post a Comment