Breaking News

06/08/2019

ప్రజా దివాన్ లో పెరిగిన ఆదరణ

వేములవాడ  ఆగస్టు 05 (way2newstv.in - Swamy Naidu )
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాధివాస్ కార్యక్రమానికి భాదితుల నుండి ఆదరణ పెరిగింది. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి 12 మంది  ఫిర్యాదుదారులు రాగ  ఎస్పీ రాహుల్ హిగ్డేనే ఆ ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్బంగా ఫిర్యాదుదారుల సమస్యలు ఆయన అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదులను క్రైమ్ కంప్లైంట్ సెల్ ద్వారా పంపించారు. చట్ట పరిధిలో తగు విచారణ చేసి  బాధితులకు న్యాయం చేకూర్చాలని ఎస్ పి ఆదేశాలు జారీ చేశారు.

No comments:

Post a Comment