భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 7 (way2newstv.in)
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాభావ ఎక్కువ ఉండడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మరియు పరిసర ప్రాంతాలలో వర్షం పడడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది . ప్రజలు ఇంటికే పరిమితమై పోయారు.
స్థంభించిన బొగ్గు ఉత్పత్తి
కొత్తగూడెంలోని సింగరేణి గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు వెలికి తీయడానికి తీవ్రంగా ఆటంకం కలిగి బొగ్గు ఉత్పత్తికి స్తంభించిపోయింది. దీనివల్ల రెండు రోజుల నుంచి వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ లలో సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ లో నీరు నిలిచిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతుంది.
No comments:
Post a Comment