Breaking News

19/08/2019

చంద్రబాబు లో ఎంత మార్పు...

విజయవాడ, ఆగస్టు 19, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికీ క్విక్ డెసిషన్లు తీసుకోలేకపోతున్నారా? కఠిన నిర్ణయాలు తీసుకోలేక క్యాడర్ లో తప్పుడు సంకేతాలను పంపుతున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చనీయాంశంగా మారింది. గీత దాటిన వారినపై ఎటువంటి చర్యలు లేవు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. తాజా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత అనేకమంది నేతలు పార్టీ లైన్ దాటుతున్నారు.రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ పార్టీని వీడి వెళ్లారు. గత ఎన్నికల్లో ఆయన కోరిక మేరకు కుమారుడు భరత్ కు టిక్కెట్ ఇచ్చి ఎస్వీ మోహన్ రెడ్డిని చంద్రబాబు వదులుకున్నారు. 
 చంద్రబాబు లో ఎంత మార్పు...

టీజీ వెంకటేష్ బీజేపీలోకి వెళ్లిపోయినా ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. భరత్ ను ఇన్ ఛార్జిగా తప్పించాలని కర్నూలు నియోజకవర్గం టీడీపీ నేతలు మొత్తుకుంటున్నా చంద్రబాబు యాక్షన్ కు దిగలేదు.ఇక రాయపాటి సాంబశివరావు తాను పార్టీని వీడుతున్నానని బహిరంగంగానే చెబుతున్నారు. పైగా జగన్ పాలన భేష్ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ రాయపాటి కుటుంబాన్ని దూరం చేసుకునే ధైర్యం చంద్రబాబు చేయడం లేదు. రాయపాటి ఫ్యామిలీ పార్టీని వీడినా చంద్రబాబు చేయగలిగిందేమీ లేదు. అయితే ముందుగానే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తే కార్యకర్తలకు క్లారిటీ వస్తుందన్నది కొందరి నేతల అభిప్రాయం.ఇక చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు ఎవరెవరు పార్టీకి సహకరించలేదో? వారి పేర్లను ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. వారిని పార్టీ నుంచి బయటకు పంపుతానని హెచ్చరించారు. జాబితాలు కూడా చంద్రబాబు వద్ద ఉన్నాయి. అనేక నియోజకవర్గాల్లో నేతలు టీడీపీ విజయానికి కృషి చేయలేదు. అయినా సరే చంద్రబాబు వారిపై యాక్షన్ తీసుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నేతలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇలా గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నేతలు ఇంకా పసుపు కండువా కప్పుకుని తిరుగుతూనే ఉండటాన్ని పార్టీ నేతలు కొందరు తప్పుపడుతున్నారు.
జూనియర్ తో మంతనాలు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య  చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ను పరామర్శించారు. ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో చంద్రబాబు కొద్దిసేపు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు తెలిసింది. కుటుంబ అంశాలతో పాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి వారసులను పక్కన పెట్టారని, బాలకృష్ణ రేసులో ఉన్నా.. యువ హీరోలను పట్టించుకోకపోవడం వల్ల యువ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయామనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో వ్యక్తమైంది. తెలంగాణ టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారంటూ గతంలో ఓ ఎమ్మెల్యే కూడా కామెంట్స్ చేశారు.చంద్రబాబు, నందమూరి వారసుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించే అంశంపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి. అప్పటి వరకు దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

No comments:

Post a Comment