Breaking News

27/08/2019

లక్ష్యం చేరని హరితహారం... (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, ఆగస్టు 27 (way2newstv.in - Swamy Naidu): హరితహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. కోట్లు వెచ్చిస్తోంది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రహదారులకు ఇరువైపులా భారీ ఎత్తున మొక్కలను నాటిస్తోంది. ఈ మొక్కలు పెరిగి పెద్దవైతే తమ పొలాల్లో పంటలు పండవని రైతులు, తమ స్థలాలకు అడ్డుగా ఉంటాయని కొందరు ప్రాథమిక దశలోనే పీకేస్తున్నారు. ఈ కారణంగా రహదారుల వెంట నాటిన మొక్కలు ఏడాది తిరిగే సరికి కనిపించటం లేదు. హరితహారంలో భాగంగా అవే స్థలాల్లో మళ్లీ మొక్కలు నాటాల్సి  వస్తోంది. హరితహారం కింద నాటిన ప్రతి మొక్కకు లెక్క ఉంటుంది. జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నారు. ఇదివరకు మొక్కలు చనిపోయినా, ఎవరైనా పీకేసినా పెద్దగా దృష్టిపెట్టేవాళ్లు కాదు. ఇక నుంచి అలా జరగదు. 
 లక్ష్యం చేరని హరితహారం... (మహబూబ్ నగర్)
ఒక్క మొక్క కనిపించకపోయినా తీవ్రంగా స్పందిస్తారు. ఎవరు మొక్క తొలగించినా సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. గట్టు మండలం ఎల్లందొడ్డిలో ఒకరు హరితహారం మొక్క తొలగించటంపై కార్యదర్శి శివన్న ఫిర్యాదు ఫిర్యాదు చేయగా ఠాణాలో కేసు నమోదైంది. అవగాహన లేక రైతులు, ఇతరులు మొక్కలను పీకేస్తే కేసుల పాలయ్యే ప్రమాదముంది. అధికారులు ఈ విషయంలో పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముంది. రహదారి మధ్య నుంచి ఒక్కోవైపు 50 అడుగుల వరకు ఆర్‌అండ్‌బీ శాఖకు స్థలం ఉంటుంది. కానీ పక్కన స్థలాల వాళ్లు రోడ్డుకు చెందిన భూమిని కూడా ఆక్రమిస్తున్నారు. రోడ్డు పక్కన అయిదు అడుగుల స్థలం కూడా ఉండటం లేదు. గద్వాల - రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి వరుసలు ఉంటుంది. ఈ రహదారి కాకుండానే రెండు వైపులా కలిపి ఖాళీ స్థలం 100 అడుగుల వరకు ఉండాల్సి ఉన్నా ఎక్కడా కనిపించటం లేదు. రైతులు, ఇతరులు రహదారి స్థలాన్ని ఆక్రమించటంతో మొక్కలు ఎక్కడ నాటాలో అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. స్థలం లేకపోవటంతో ఉపాధి హామీ కూలీలు మొక్కలు నాటటం కోసం గద్వాల - రాయచూరు దారికి ఆనుకుని అయిదు అడుగుల దూరంలోనే గుంతలు తవ్వుతున్నారు.

No comments:

Post a Comment