Breaking News

14/08/2019

భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం

స్వామి సన్నిధిలో అడుగడుగునా అవినీతి
అడుగడుగునా భక్తులకు నిలువు దోపిడీ
కౌతాళం  ఆగస్టు 14  (way2newstv.in)
మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం నరసింహ స్వామి పుణ్యక్షేత్రం స్వామి సన్నిధి లు అడుగడుగునా అవినీతి అడుగడుగునా భక్తులకు నిలువు దోపిడీ చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు మంత్రాలయం ఇన్చార్జి పురుషోత్తము రెడ్డి జిల్లా కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణపేర్కొన్నారు. బీజేపీ నాయకులు మరియు మండల నాయకులు ఆధ్వర్యంలో మంగళ వారం ధర్నా నిర్వహించారు. బిజెపి నాయకులు  మాట్లాడుతూ ప్రధానంగా నీటి సమస్య అని, స్నానపు గదులు మరుగుదొడ్లు మరియు స్త్రీలకు వస్త్రధారణ గదులు, పరిశుద్ధం అటకెక్కింది అని, తలనీలాలు లో భారీగా అవినీతి, టెంకాయలు భారీగా అవినీతి భక్తులకు ముక్కుపిండి వసూలు చేసిన టెండర్లు 20 లక్షలకు తగ్గింపు, 
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం
బియ్యం బ్యాళ్లు లో అవినితి, అన్నదాన సత్రం లో అసౌకర్యము మరియు నాణ్యత లోపం, హుండీ లెక్కింపు లో ఈవో గారు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం, గుడి లోపలికి వెళ్లే మార్గంలో క్యూలైన్లు సరిగా లేకుండా పోవడం భక్తులకు ప్రాణలతో చలగటం, చిరు వ్యాపారుల టెండర్లలో మొత్తం ఒకరికి ఇవ్వడం, నిన్న జరిగిన గుడిలోపల సంఘటనం లో భద్రత సిబ్బంది వైఫల్యం దీనిపై తగు చర్యలు బాధ్యత లాపై చర్యలు, లడ్డూ పులిహోర నాణ్యత లోపం లడ్డు టికెట్లు భారీ గా అవినీతి, ఆలయం హుండీ  కౌంటింగ్ లో జరుగుతున్న సమాచారం 30 మంది విలేకరులకు సమాచారం ఇవ్వకుండా ముగ్గురు విలేకర్లకు మాత్రమే సీక్రెట్ గా చెప్పడం ఎండోమెంట్ వారికి ముగ్గురు విలేకర్లకు చీకటి ఒప్పందం ఏమిటి ప్రశ్నించారు. వీటన్నిటికీ బాధ్యులు ఎండోమెంట్ సిబ్బంది మరియు ఈవో పై చర్యలు  వీరు నిర్లక్ష్య ధోరణి ఇకనైనా వీరి విధులు సక్రమంగా నిర్వహించుకుం టే వారిపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా వచ్చి మరోసారి ధర్నాలు రాస్తారోకోలు  నిర్వహిస్తామని ఎండోమెంట్ సిబ్బంది వారికి హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం  ఇంచార్జ్ పురుషోత్తం రెడ్డి జిల్లా కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ,రామాంజినేయులు,రామచంద్ర, యాంకన్నా, మరియు మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment