Breaking News

03/08/2019

సాగుబడికే బడీడు పిల్లలు

అదిలాబాద్, ఆగస్టు3 , (way2newstv.in
ఆదిలాబాద్ జిల్లాల్లో గట్టు మండలంలో విద్యావ్యవస్థ పనితీరు దయనీయంగా మారింది. అక్షరాస్యతలో వెనుకబడింది గట్టు మండలం.మండలంలో 40 ప్రాథమిక పాఠశాలలు, 11 ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 7 జిల్లాపరిషత్‌ పాఠాశాలలు, ఒక మండల పరిషత్‌ పాఠశాల ఉన్నాయి. ఈ అన్ని పాఠశాలలో కలిపి 77 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. మండలంలో ఇంకా157 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన్నప్పటికీ ప్రభుత్వం నామ మాత్రంగా 157 విద్యావాలంటీర్ల పోస్టులను తీసుకోను న్నట్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  దీనికి తోడు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు పాఠశాలకు వెళ్లడమే మానివేశారు.
సాగుబడికే  బడీడు పిల్లలు

ఉన్న పాఠశాలలో విద్యావాలంటీర్లతోనే నడుపుతున్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో ఎలాంటి మారులూ తీసుకురావడంలేదు. ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాలకు తాళలు వేసి దర్శనమిస్తున్నాయి. జిల్లాల్లోని 64 మండలాల్లో అత్యధికంగా గట్టు మండలంలో ఎక్కువ మొత్తంలో విద్యావాలంటీర్లను ఆగస్టులో తీసుకున్నారు. దీంతో విద్యా సంవత్సరం మధ్య నుండి విద్యార్థులకు పాఠ్యాంశాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కుస్తీపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో పనులకు చూపించేందుకే పేరంట్స్ మొగ్గు చూపుతున్నారు. ప్రయివేట్‌లో చదివించేందుకు స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను పొలం పనులకు తీసుకెళ్తున్నారు. మరి కొంత మంది పేదరికం కారణంగా బాల్యవివాహాలు చేస్తున్నారు. గతేడాది బడిబయట పిల్లల సంఖ్య 3,050 ఉండగా ఈ ఏడాది 3,070 పైగా ఉన్నారని సమా చారం. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కిశోర బాలికలతో సంఘాలు ఏర్పాటు చేసి బాల్యవివాహాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. అయినా ఎలాంటి మార్పూ కన్పించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాల పోస్టుల భర్తీ చేయాలని, సర్కార్‌ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

No comments:

Post a Comment