Breaking News

28/08/2019

సెప్టెంబర్ 4 నుంచి టీ అసెంబ్లీ...?

హైద్రాబాద్, ఆగస్టు 28, (way2newstv.in)
తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 4,9,14 తేదీల్లో ఏదో ఒక తేది నుండి సమావేశాలు ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 4, 9, 14 తేదీల్లో ఏదో ఒక తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 
సెప్టెంబర్ 4 నుంచి టీ అసెంబ్లీ...?

ప్రగతి భవన్ లో బడ్జెట్ పై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల తేదీపై చర్చించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రాష్ర్ట మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను సమావేశపరిచి ఆర్ధిక పరిస్థితి వివరించాలని.. ఆర్ధిక క్రమశిక్షణ పాటించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమర్చి చెప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్ల, సెక్రటరీల సమావేశం ఉన్నందున అంతకు ముందే అసెంబ్లీ సమావేశాలు జరుపాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసినందున ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టడం.. తదుపరి రోజు సెలవు ఇవ్వడం.. తర్వాత రోజుల్లో చర్చ..అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదించనున్నారు. అసెంబ్లీ సమావేశ పరచడానికి ముందే మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయం త్వరలో నిర్ణయించనున్నారు. వచ్చే శాసన సభా సమావేశాల్లో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం, అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్‌ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని..ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు ఉండేలా చూడాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆర్ధిక మాంద్యం ప్రభావం బడ్జెట్ పై చూపే అవకాశాలున్నాయని భావిస్తుండటంతో..ఎన్నికల హామీలు ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. బడ్జెట్ రూపకల్పనపై ఇవాళ కూడా కసరత్తు చేపట్టనున్నారు సీఎం కేసీఆర్.  గత మార్చిలో తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్..2019-20 ఆర్ధిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనపై అధికారులతో కసరత్తు చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరుపాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు అత్యధిక నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం రాష్ర్ట బడ్జెట్ పై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలపై ఆర్ధిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. షాదిముబారక్, కళ్యాణ లక్ష్మి, వృద్దాప్య పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, రైతు బంధు బకాయిలు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయాల్సి ఉంది.ఆదాయం, అవసరాలకు అనుగుణంగా ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని.. ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు ఉండేలా చూడాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. తుది రూపం వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం, అసెంబ్లీని సమావేశ పరిచి, బడ్జెట్ ప్రతిపాదించడం వంటి ప్రక్రియలు నిర్వహించాలని సూచించారు. 

No comments:

Post a Comment