Breaking News

17/07/2019

మొక్కలు నాటి వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

నిర్మల్ , జూలై,17 (way2newstv.in):
ప్రతి ఇంటా మొక్కలు నాటి వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ.సి.శశిధర్ రాజు ఉందన్నారు, బుదవారం నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిదిలోని అనంతపేట్ గ్రామంలో గ్రామా సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. 
మొక్కలు నాటి వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చెట్లు ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయన్న విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసినవారమవుతాం ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. చెట్లు అడవులు అంతరించి పొవడంతొనే వర్షాలు కురుస్తా లేవని గ్రహించాలన్నారు.  ఈ కార్యక్రమంలో భైంసా డి.ఎస్పీ. రాజేష్ భల్ల, గ్రామీణ సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఐ. కృష్ణ కుమార్, అల్లోల మురళీధర్ రెడ్డి, గ్రామా సర్పచ్ అశోక్, గ్రామా పెద్దలు, పలువురు ఉన్నారు

No comments:

Post a Comment