హైద్రాబాద్, జూలై 15, (way2newstv.in)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. వచ్చే నెల చివరివారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి.. వెంటనే పూర్తిస్థాయి బడ్జెట్ పై కసరత్తు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.జులై 18, 19వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆగస్టులో బడ్జెట్ సమావేశాలు
కొత్త మున్సిపల్ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా సమావేశాలు జరుగనున్నాయి. జులై 18వ తేదీ మున్సిపల్ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. 19వ తేదీ ఈ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. అదే రోజున శాసనమండలిలోనూ కొత్త మున్సిపల్ చట్టం బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ చట్టాన్ని రూపొందించింది. రెండు, మూడు రోజులుగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా దీనిపై చర్చిస్తున్నారు. ముసాయిదా చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం న్యాయాధికారులు దీనిని పరిశీలిస్తున్నారు. సభలో బిల్లుకు ఆమోదముద్ర పడిన వెంటనే చట్టంగా మారనుంది. ఇప్పటికే మున్నిపల్ ఎన్నికలు జరగాల్సివుండగా.. చట్టం అమల్లోకి వచ్చాక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి
No comments:
Post a Comment