Breaking News

11/07/2019

బీజేపీ `ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్‌`

న్యూఢిల్లీ జూలై 11, (way2newstv.in)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యూహాత్మకంగా ఎద‌గాలి. ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఇదీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత‌ల వ్యూహం. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగాల‌ని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బీజేపీ `ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్‌`ను ప్రారంభించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. ఏపీలో నిల‌బ‌డేందుకు గ‌ట్టిగా పావులు క‌దుపుతున్నారు. ప్రజల్లో క్షేత్రస్థాయిలో బ‌లం అనే మాట‌ను ప‌క్కన పెట్టి.. నాయ‌కుల‌ను సాధ్యమైనంత వ‌ర‌కు పెద్ద ఎత్తున ఇత‌ర పార్టీల నుంచి తీసుకునేందు కు వ్యూహానికి పావులు క‌దుపుతున్నారు.ఈ నేప‌థ్యంలో `ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్`ను ప్రారంభించారని స‌మాచారం. 
బీజేపీ `ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్‌`

ముఖ్యంగా టీడీపీకి సెంటిమెంట్‌గా వ‌స్తున్న “ఆగ‌స్టు సంక్షోభాన్ని“ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయ‌త్నిస్తున్నట్టు స‌మాచారం. సాధ్యమైనంత వ‌ర‌కు టీడీపీలో చీలిక‌లు తీసుకువ‌చ్చి.. త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కుల‌ను బీజేపీ దిశ‌గా పార్టీ మారే విధంగా వ్యూహాత్మకంగా అడుగు లు వేయాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం కాపు సామాజిక వ‌ర్గం త‌ట‌స్థంగా ఉంది. త‌మ‌కు మేలు చేసే విధంగా టీడీపీ అధినేత వ్యవ‌హ‌రించ‌డం లేద‌ని, కాబ‌ట్టి త‌మ దారి తాము చూసుకోవ‌డ‌మే క‌రె క్ట్ అని భావిస్తున్నారు.కాపు సామాజిక వ‌ర్గంలోని ఈ వీక్ నెస్‌ను గుర్తించిన బీజేపీ నాయ‌కులు.. ఈ వ‌ర్గం.. జ‌న‌సేన‌కు ద‌గ్గ‌ర‌కు కాకుండా త‌మ‌వైపు తిప్పుకొనేందుకు క‌మ‌ల ద‌ళం కాపు కాయాల‌ని నిర్ణయించుకుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌ను పార్టీలోకి ఆహ్వా నించాల‌ని, సాధ్యమైనంత ఎక్కువ సంఖ్య‌లో నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబం ధించి వ‌చ్చే నెల‌లోగా ఒక క్లారిటీకి వ‌చ్చి.. ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ఈ బాధ్యత‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌హా ఇత‌ర నాయ‌కులకు కూడా అప్పగించార‌ని తెలుస్తోంది. అదే టైంలో ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి రామ్‌మాధ‌వ్ సైతం ఏపీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వ‌చ్చేఏ రెండు మూడేళ్లలో ముందుగా టీడీపీని టార్గెట్‌గా చేసుకుని ఆ పార్టీని బాగా వీక్ చేసి ఆ త‌ర్వాత అప్పటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ముందుకు వెళ్లాల‌న్నదే బీజేపీ ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

No comments:

Post a Comment