Breaking News

04/07/2019

టీడీపీ వాసనలు తొలగించే పనిలో జగన్


తిరుపతి, జూలై 4  (way2newstv.in)
వర్తమాన రాజకీయ వ్యవస్థలో మ్యానేజ్ చేయడం చాలా తేలిక. పదవులను ఖరీదు చేసుకుని అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులు సులువుగా మ్యానేజ్ అయిపోతారని నమ్మకం. చాలా చోట్ల అలాగే జరుగుతోంది. అయితే ఈ కాలంలోనూ అందరూ అలా ఉండరన్నది జగన్ నిరూపిస్తున్నారు. వై.ఎస్.జగన్ వైఎస్సార్ ని ఆదర్శంగా తీసుకున్నా అనేక విషయాల్లో తండ్రీ కొడుకుల స్టయిల్ వేరు. వైఎస్సార్ కొన్ని విషయల్లో కఠినంగా ఉన్నా, తన వారూ అనుకున్నపుడు కొంత మెత్తబడిన సంఘటనలు అ ఉన్నాయి. అదే జగన్ విషయంలో అలా ఆశించలేం. జగన్ తాను ఏది అనుకుంటే అదే చేస్తారు. ఆయన నమ్మాలి కానీ ఎంతవర‌కైనా వెళ్తారు. జగన్ వైఖరి వల్లనే ఆయన ఈనాటి రాజకీయాల్లో పోరాటాల ద్వారానే పదవి దక్కించుకున్నారు తప్ప, ఎవరినీ ఆశ్రయించి కాదు అన్నది తెలిసిందే.

టీడీపీ వాసనలు తొలగించే పనిలో జగన్

ఇక తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ వ్యవహారం జగన్ అంటే ఏంటో మరో మారు తెలియచేసింది.ఇక టీటీడీ జేఈఓగా శ్రీనివాసరాజు రికార్డ్ చాలా అరుదైనది. ఏకంగా పదకొండేళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేశారు. ఎందరో ముఖ్యమంత్రులను చూశారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇలా అందరినీ మ్యానేజ్ చేసి జీఈవో సీట్లో కుదురుకుపోయిన శ్రీనివాసరాజుకు ఇపుడు జగన్ రూపంలో భారీ కుదుపు వచ్చింది. వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీ జరగలేదు. దాంతో ఇక శ్రీనివాసరాజు మళ్ళీ తన బలాన్ని చూపించారని, ఆయన్ని ఎవరూ కదపలేరని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఒక్కసారిగా జేఈఓ బదిలీ కావడంటో జగన్ ను ఎవరూ మ్యానేజ్ చేయలేరని రుజువు అయింది.మొత్తం టీటీడీలో తెలుగుదేశం వాసనలు పూర్తిగా తొలగించేందుకు వై.ఎస్.జగన్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ గా నియమించిన వైవీ సుబ్బారెడ్డి కూడా సహకారం అందిస్తున్నారు. దాంతో జగన్ మొత్తానికి మొత్తం పాతుకుపోయిన సరకుని బయటకు నెట్టేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం తో బలమైన బంధాలు ఉన్న శ్రీనివాసరాజుని సాగనంపేశారు. ఇక కొత్త జేఈవోగా ధర్మా రెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. ఆయన గతంలో వైఎస్సార్ టైంలో కొన్నాళ్ళు అక్కడ పనిచేశారు. జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన‌కి బాధ్యతలు అప్పగినడం ద్వారా టీటీడీని దారికి తేవాలని జగన్ అనుకుంటున్నారుట. చూడాలి మరి

No comments:

Post a Comment