Breaking News

23/07/2019

ఇక ట్రైన్స్ లో సీరియల్స్

హైద్రాబాద్, జూలై 23 (way2newstv.in)
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీకు త్వరలోనే ట్రైన్లలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది. సీరియల్స్, సినిమాలు చూడొచ్చు. పాటలు వినొచ్చు. కరెంట్ ఆఫైర్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్ అందుబాటులోకి రావొచ్చు. రైల్వే స్టేషన్లలో లేదంటే ట్రైన్‌లోనే మీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఈ సేవలను పొందొచ్చు.రైల్వే బోర్డు ప్రయాణికులకు ఈ సేవలు అందించేందుకు రైల్‌టెల్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాతో జతకట్టింది. దీంతో రైల్వే ప్యాసింజర్లు వారికి నచ్చిన కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు. 
 ఇక ట్రైన్స్ లో సీరియల్స్

ఉచిత యాప్ ద్వారా ప్రిలోడెడ్ కంటెంట్ రూపంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రిలోడెడ్ కంటెంట్‌లో టీవీ సీరియల్స్, సినిమాలు, పాటలు, భక్తి ప్రోగ్రామ్స్, వార్తలు, ఎడ్యుకేషనల్ కంటెంట్ వంటివి ఉంటాయి. వీటిని యాప్ ద్వారా చూడొచ్చు. ప్రస్తుతం 1,600 స్టేషన్లలో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ఏడాది అక్టోబర్ కల్లా మిగతా అన్ని స్టేషన్లలోనూ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులకు ఈ సేవలు అందించడం వల్ల రైల్వేస్‌కు ఏం లాభం వస్తుంది? అని మీ మదిలో ఒక ప్రశ్న తలెత్తొచ్చు. లాభం లేనిదే ఎవ్వరూ ఏ పని చేయరు. మరీముఖ్యంగా కంపెనీలు ఉచితంగా ఎలాంటి సేవలు అందించవు. రైల్వేస్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. యాప్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ సేవల వల్ల రైల్వేకు ఆదాయం వస్తుంది. ఎలా అంటే యాడ్స్ రూపంలో. యాప్ ఓపెన్ చేయగానే యాడ్ కనిపించొచ్చు. అలాగే టీవీ సీరియల్ లేదా సినిమా చేసేటప్పుడు మధ్యలో కూడా ప్రకటనలు రావొచ్చు. దీంతో రైల్వేస్‌కు మంచి ఆదాయం వస్తుంది. 

No comments:

Post a Comment