Breaking News

10/07/2019

కమలానికి అంత వీజీ కాదు

గుంటూరు, జూలై 10, (way2newstv.in)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి పెట్టని కోట. దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేకత కనిపించినా ఏపీలో మాత్రం 1977లో కాంగ్రెస్ ని గెలిపించిన అభిమానం తెలుగువారిది. దాన్ని నిలబెట్టుకోనందుకు 1983లో భారీ మూల్యం చెల్లించింది ఆ పార్టీ. 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత జరిగిన ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తే ఏపీలో మాత్రం అన్న నందమూరి తెలుగుదేశం గెలిచింది. ఇక ఆ తరువాత కూడా కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. దానికి కారణం తెలుగు జనాలకు టీడీపీకి ప్రత్యామ్యాయంగా గా కాంగ్రెస్ ఉంది కాబట్టి. పైగా అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ అంటే చెప్పలేని నమ్మకం. అటువంటి దాన్ని కాంగ్రెస్ విభజన దెబ్బతో పోగొట్టుకుంది. బీజేపీ విషయానికి వస్తే ఎపుడూ సింగిల్ డిజిట్ సీట్లు తప్ప రెండంకెలు తెలంగాణాలో లేవు. 
కమలానికి అంత వీజీ కాదు

ఏపీలో అయితే పొత్తులు ఉంటేనే తప్ప కధ నడవదు. అటువంటి బీజేపీ ఇపుడు ఏపీలో ఆశలు బాగా పెంచుకుంటోంది.ఏపీలో ఉన్న రాజకీయ వాతారణం చూసినా, సామాజిక సమీకరణలు చూసినా బీజేపీకి చిక్కే రాష్ట్రం కాదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీకి మళ్ళిపోయింది. అది బీజేపీ వైపు తిరగడం కష్టం. ఇక టీడీపీ వైపు ఉండే కమ్మలు, ఇతర అగ్ర కులాలు కమలం వైపు తిరిగినా బీసీలు, ఇతర వర్గాలు మారడం అంత సులువు కాదు. ఈ సంగతి ఇలా ఉంటే ఏపీ మీద కక్ష కట్టినట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందన్న భావన ప్రజల్లో బలపడిపోయింది. చంద్రబాబును మార్చి చూసినా ఏపీకి కేంద్ర సాయం అందలేదంటే కచ్చితంగా మోడీ ఎఫెక్ట్ అన్నది జనాలకు అర్ధమైపోయింది. ఏపీని ఏ విధంగా ఆదుకోకుండా ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకుండా బీజేపీ ఎన్ని ఫిరాయింపులు జరిపినా పాగా వేయడం కష్టం. ఇక కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత ఇకపై బీజేపీలో ఎవరైనా చేరుతారనుకుంటే కూడా పొరపాటే.ఇంతకాలం కేంద్రంలో బీజేపీ ఉంది. అధికారం ఉంటుందని అక్కడ చేరిపోవాలని భావించిన వారికి కేంద్ర బడ్జెట్ తో బీజేపీ షాక్ ఇచ్చేసింది. కేంద్రంలో పవర్ ఉంటే ఉండొచ్చు కానీ బేస్ ఏపీయే కదా, ఇక్కడ రాజకీయంగా దెబ్బ తింటే మొత్తం పొలిటికల్ కెరీర్ పోతుంది. ఈ సంగతి తెలిసిన నాయకులెవరైనా బీజేపీలో చేరరు. అందువల్ల ఏపీలో బీజేపీ పెరుగుతుందని ఆశలు ఎవరికైనా ఉంటే అవి మానుకోవాల్సిందే. ఇక టీడీపీ సైతం ఫిరాయింపుల గురించి బెంగ పడనక్కరలేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీ జనాల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయడం లేదు కాబట్టి. మొత్తానికి బీజేపీ ఏపీ జనాల గురించి ఆలోచించకుండా దండోపాయంతో బలపడదామనుకుంటే అది  ఎప్పటికీ జరగదేమో.

No comments:

Post a Comment