Breaking News

30/07/2019

ఆ విషయంలో జగన్, బాబు ఒక్కటే

హైద్రాబాద్, జూలై 30, (way2newstv.in Swamy Naidu)
చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు ఇద్దరూ ఒక విషయంలో మాత్రం ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నారని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో నువ్వా? నేనా? అన్నట్లు చంద్రబాబు, జగన్ లు సాగుతున్నారు. తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇద్దరూ హోరాహోరీ తలపడ్డారు. ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య లబ్ది పొందుతున్నది పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండేది. మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికల వరకూ ఆ పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉండేది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగై పోయింది. 
 
 ఆ విషయంలో జగన్, బాబు ఒక్కటే

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 2014 ఎన్నికల్లో తెలంగాణలోనూ కొంత సత్తా చాటగలిగింది. మూడు శాసనసభ స్థానాలను, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకోగలిగింది.ఇక 2014 ఎన్నికల అనంతరం ఈ రెండు పార్టీల పరిస్థితి తెలంగాణాలో మారిపోయింది. వైఎస్ జగన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దించలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆయన ఆశీస్సులు ప్రతి విషయంలో అందుకుంటున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయాలన్న ఆలోచన కూడా జగన్ చేయరన్నది దాదాపుగా అర్థమయిపోయింది.చంద్రబాబునాయుడు విషయానికి వస్తే ఆయన పార్టీ 2018 ఎన్నికల్లో పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే చంద్రబాబునాయుడుకు ముఖ్యం. కేసీఆర్ ను విమర్శించి తిరిగి ఏపీలో అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే గోదావరి జలాల విషయంలో కేసీఆర్ జోక్యంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టులు నిర్మించడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇక చంద్రబాబు కూడా తెలంగాణ పార్టీపై పెద్దగా దృష్టి పెట్టరన్నది తేలిపోయింది. మొత్తం మీద జగన్, చంద్రబాబుల కయ్యం కేసీఆర్ కు కలసి వచ్చింది.

No comments:

Post a Comment