Breaking News

20/07/2019

పేదరికం ఉన్నంతవరకు పెన్షన్లు

మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జూలై 20,(way2newstv.in):
తెలంగాణలో పేదరికం ఉన్నంత కాలం ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందని అందుకు ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం జిల్లా కేంద్రంలో పెన్షన్ పత్రాలను, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ లో ఉన్న అన్ని రకాల వనరులను సద్వినియోగం చేసు కుంటే పదేళ్లలో తెలంగాణ దేశంలోనే గొప్పరాష్ట్రంగా నిలుస్తుందని ఆయన అన్నారు. 
పేదరికం ఉన్నంతవరకు పెన్షన్లు 

ఈ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి పనులతో పాటు, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. వెయ్యి రూపాయలు పెన్షన్ ను 2016, 1500 పెన్షన్ ను 3016 కు పెంచడం జరిగిందని పెరిగిన పెన్షన్ను మీ అకౌంట్లో జమ అవుతాయని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ మూలంగా పెన్షన్ల పెంపు ఆలస్యం అయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట అమలులో ఆలస్యం కావచ్చు కానీ అమలు చేయడం గ్యారెంటీ అని మంత్రి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 40 వేల కోట్ల పింఛన్లు, గురుకులాలు, కెసిఆర్ కిట్ లు వంటి సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య. మాజీ చైర్మన్ రమేష్ గౌడ్. మాజీ కౌన్సిలర్లు గట్టు యాదవ్. వాకిటి శ్రీధర్, వల్ల మల్ల శ్యాం కుమార్. తిరుమల్. లక్ష్మీనారాయణ. పాకనాటి కృష్ణ. పార్వతమ్మ. ప్రమీలమ్మ. కమలమ్మ. ఇందిరమ్మ. సుజాత. టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment