Breaking News

01/07/2019

ప్రారంభమైన టీ ఎంసెట్ కౌన్సెలింగ్


ఐదు  నుంచి వెబ్ ఆప్షన్లు
హైద్రాబాద్, జూలై 1, (way2newstv.in)
తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను అధికారులు ఎట్టకేలకు ఖరారు చేశారు. తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జులై 5 నుంచి వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. వాస్తవానిక జులై 1 నుంచే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. 

ప్రారంభమైన టీ ఎంసెట్ కౌన్సెలింగ్

ఫీజల విషయంలో నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో నాలుగు రోజులు ఆలస్యంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందన్న విషయంపై మాత్రం అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 53,364 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. వీరిలో 37,413 మంది అభ్యర్థులు ఇప్పటివరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అయితే కౌన్సెలింగ్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి జులై 1 చివరి తేదీ కాగా.. జులై 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగనుంది. జులై 5 నుంచి వెబ్‌‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది

No comments:

Post a Comment