Breaking News

24/07/2019

మరోసారి కేసీఆర్ డ్రామా

జోగులాంబ గద్వాల జూలై 24 (way2newstv.in)
చింతమడక లో కేసీఆర్  ప్రతింటికి 10 లక్షల ఇస్తామని  చెప్తున్నాడు. రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధి కేసీఆర్ కు పట్టదా అని బీజేపీ నేత, మాజీ మంత్రి డికే ఆరుణ ప్రశ్నించారు. బుధవారంర ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత గ్రామాలను అభివృద్ధి చేశారని గతం లో ఉన్న సీఎం లపై విమర్శలు చేసిన కేసీఆర్..ఇప్పుడు చేస్తున్నది ఏంటి ? సీఎం గజ్వెల్,సిరిసిల్లకు సిద్ధిపేటకు మాత్రమే వేల కోట్ల నిధులు ఇస్తున్నారు. గతంలో పాలమూరు ప్రజలు నిన్ను ఎంపీ గా గెలిపించారు... మరీ ఎందుకు పాలమూరు అభివృద్ధి గుర్తుకు రాలేదని నిలదీసారు. 
మరోసారి కేసీఆర్ డ్రామా

రైతులకు ఇప్పటివరకు రైతు బంధు చెక్కులు రాలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ పాటించుకోలేదు. ఎన్నికల ముందు మరో సారి కేసీఆర్ డ్రామా మొదలు పెట్టారు. చింతమడక లా ఎన్ని గ్రామలను అభివృద్ధి చేస్తారో చెప్పాలి. చితమడక కే కాదు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అమె అన్నారు. రాష్ట్రం అన్ని గ్రామాలను సమాన గా అభివృద్ధి చేయాలి. పెన్షన్ లబ్ధి దారులపై చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. ప్రజలకు పుటగతులు ఉండవని మంత్రి చెప్పడం సిగ్గు చేటు. మాకు సపోర్ట్ చేస్తేనే పథకాలు అమలు చేస్తామనే విధంగా టీఆర్ ఎస్ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మున్సిపాటీ ఎన్నికల తీరుపై కోర్టు మొట్టికాయలు వేసిన తప్పుడు మార్గాలలో గెలుపు కోసం ముందుకు పోతున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం ఇచ్చినా,   అర్హత ఉన్న వారి పై చర్యలకు పాల్పడితే పోరాటం చేస్తామని అన్నారు. మార్కెట్ యాడ్ లో టీఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ ఎలా పెడతారని ఆరుణ ప్రశ్నించారు.

No comments:

Post a Comment