అమరావతి జూలై 22 (way2newstv.in):
రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రగడ జరిగింది. ప్రపంచ బ్యాంకు రుణం, టెండర్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటన అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..
టీడీపీ ప్రభుత్వం వల్లే రుణం నిలిచిపోయింది : మంత్రి బుగ్గన
రాజధాని రోడ్ల ప్యాకేజీల్లో అక్రమాలపై ప్రపంచ బ్యాంక్ నివ్వెరపోయిందని అన్నారు. కాంట్రాక్టర్లతో టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. 9 నుంచి 14 శాతం అధిక ధరలు కోట్ చేయడంపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని మంత్రి బుగ్గన అసెంబ్లీకి తెలిపారు. టీడీపీ ప్రభుత్వ చర్యలకు విస్తుపోయిన ప్రపంచ బ్యాంకు రుణాన్ని నిలిపివేసిందన్నారు. ప్రపంచ బ్యాంక్ అభ్యంతరాలను టీడీపీ ప్రభుత్వం పక్కనబెట్టిందని అన్నారు. అయితే మంత్రి బుగ్గన ప్రకటనను ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఖండించారు. అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
No comments:
Post a Comment