Breaking News

05/07/2019

సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక ప్రజల హృదయాలలో.. చిరకాలం గుర్తుండాలి...


శాశ్వతంగా జీవనోపాధి కల్పించేలా సర్వే 
కలెక్టరేట్ అధికారుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు 
సిద్దిపేట, జూలై 05 (way2newstv.in)
ప్రతి కుటుంబానికి మంచి ఇళ్లు ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన.! ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి వారు నచ్చిన విధంగా వారి స్వంత స్థలంలోనే కట్టుకునే అవకాశం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి..!! ప్రతి కుటుంబం యొక్క సర్వే ఆర్థికంగా నిలబెట్టుకునేలా కుటుంబాలకు శాశ్వతంగా భరోసాగా సర్వే ఉండాలని, అధికారులు ఇచ్చే నివేదిక సీఎం కేసీఆర్, చింతమడక ప్రజల హృదయాలలో చిరకాలం గుర్తుండాలని అధికారిక వర్గాలకు రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక రానున్న నేపథ్యంలో జిల్లా అధికారిక యంత్రాంగంతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, గ్రామస్తులకు లబ్ధి చేకూరేలా పక్కా ప్రణాళికలు తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. 

సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక ప్రజల హృదయాలలో.. చిరకాలం గుర్తుండాలి...


సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఇక నుంచి ఇళ్లు లేని కుటుంబం ఉండరాదని సూచించారు. సీఎం కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఆర్థిక సాయం అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందు కోసం గ్రామంలోని ప్రతి కుటుంబంతో సుదీర్ఘంగా చర్చించి వారి అవసరాలను గుర్తించి సమగ్ర సంపూర్ణ కుటుంబ సర్వే నివేదిక ఇవ్వాలని ఏంపీడీఓలను ఆదేశించారు. అలాగే దేశీ కోళ్ల పౌల్ట్రీ ఫామ్, బ్రాయిలర్ కోళ్ల పౌల్ట్రీ ఫామ్స్ రూ.5 లక్షలు యూనిట్, రూ.10 లక్షలు యూనిట్ గా వెయ్యి బర్డ్స్ తో పౌల్ట్రీ ఫామ్స్ ఏర్పాటు చేయించేలా నివేదికలు రూపొందించాలని సూచించారు. అలాగే అసైన్డు భూముల్లో ఎస్సీలకు మోటార్లు, బోరు బావులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఎస్సీ కార్పోరేషన్ ఈడీ చరణ్ దాస్ ను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖతో గ్రామంలోని పాఠశాల అదనపు తరగతి గదులు, భూమి లేని వారికి ట్రాక్టర్స్ ఇవ్వడం, భూమి ఉంటే డైరీ, కుటుంబాల వారీగా రూ.10 లక్షలతో హార్వేస్టర్, హార్టికల్చర్ తో మల్బరీ సాగు, గ్రామంలోని చెరువు సుందరీకరణ తదితర అంశాలపై చర్చించి ఆదేశాలు, సూచనలు చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఇంటి వారీగా పరిగణించే సర్వే వివరాలతో పాటు వారి మోబైల్ నంబరు సేకరించాలని సూచిస్తూ., వారి అవసరాలపై కుటుంబాలతో సుదీర్ఘంగా చర్చించి పక్కా నివేదిక రూపొందించాలని, మీరు చేసిన సర్వే పై ర్యాండమ్ పద్ధతిన ఎంపిక చేసి స్వయంగా తానే విచారణ చేస్తానని., మీరు చేపట్టిన సర్వే వివరాల గురించి కొంతమంది గ్రామస్తులతో చర్చిస్తానని హరీశ్ రావు వివరించారు. అంతకు ముందు చింతమడక గ్రామ ప్రజల సుస్థిరమైన అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలు నివేదిక రూపంగా జిల్లా అధికారిక యంత్రాంగం సిద్ధం చేస్తున్నదని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి చెప్పారు. ఇందుకు గాను జిల్లాలోని అన్నీ శాఖలకు చెందిన అధికారులు, ఏంపీడీఓల బృందంతో కలిసి చింతమడక గ్రామ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినట్లు., ఆ సర్వేలోని కీలక అంశాలను సమీక్షలో కలెక్టర్ వెల్లడించారు. ప్రత్యేకించి ఇళ్లు, డైరీ, జీవనోపాధి (లైవ్లీ హుడ్)అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వీటితో పాటు వ్యవసాయం, (ఏంపీడీఓ) కుటుంబం వారీగా, (రెవెన్యూ )భూమి ఉన్న వారు, భూమి లేని వారు, ఆరోగ్యం తదితర అంశాలపై క్షుణ్ణంగా సర్వే జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు గ్రామంలోని ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రస్తుత పరిస్థితి కంటే ఉన్నతంగా ఆర్ధిక అభివృద్ధి కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని అధికారులను హరీశ్ రావు కోరారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతిలో చేపట్టేందుకు కావాల్సిన పనిముట్లు, హార్వెస్టర్స్, హార్టి కల్చర్ ద్వారా గ్రామంలోని 250 మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని, అలాగే డైరీ ద్వారా గ్రామంలోని నిరుద్యోగ యువత కోసం వారితో చర్చించి వారికి అనుగుణంగా.. ఆమోదయోగ్యమైన ఆటోలు, కార్లు ఇతరత్రా ఇద్దామని., ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చేలా అధికారులుగా మీరు చేపట్టే సర్వే ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలబెట్టుకునేలా కుటుంబాలకు శాశ్వతంగా భరోసాగా సర్వే ఉండాలని, అధికారులు ఇచ్చే నివేదిక సీఎం కేసీఆర్, చింతమడక ప్రజల హృదయాలలో చిరకాలం గుర్తుండేలా చేద్దామని రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు అధికారులను కోరారు. భూమి లేని వారికి, నిరుద్యోగ యువతకు వారి యొక్క ఆర్ధిక పరిస్థితి నిలబడేలా పక్కాగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలోని 100 ఎకరాలలో అటవీ విస్తీర్ణం అభివృద్ధి కోసం ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ కు సూచించారు. ఇప్పుడు మనం గ్రామస్తుల కోసం ఏం చేస్తున్నాం.. ఏం ఇవ్వడం గొప్పకాదు.. చింతమడక ప్రజలకు.. చిరకాలం గుర్తుండేలా మనం ఇచ్చేవన్నీ నిలబడేలా ఉండాలని అన్నారు. అన్నీ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment