Breaking News

08/07/2019

ఆదాయం దిశగా హెచ్ ఎం డీ ఏఅడుగులు


హైద్రాబాద్, జూలై 8, (way2newstv.in)
మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పుల ద్వారా సుమారు రూ. 6 వేల కోట్ల ఆదాయం అర్జించాలనే దిశగా హెచ్‌ఎండిఎ సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా వచ్చే  ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. అథారిటీ విస్తరిత ప్రాంతాన అమలులో ఉన్న కొన్ని ప్రతిపాదనల్లో మా ర్పులు చేర్పుల ద్వారా ఈ ఆదాయం సంస్థ ఖజానాకు చేరుతుందనేది కమిషనర్ చిరంజీవులు నమ్మకం. మాస్టర్‌ప్లాన్‌లో దొర్లిన పొరపాట్లను సరిదిద్దేపనిలో నిమగ్నమైంది హెచ్‌ఎండి. ప్రస్తుత సమీకృత మాస్టర్‌ప్లాన్‌లో సుమారు 900 వరకు రోడ్ల ప్రతిపాదనలను తొలగించాలని నిర్ణయించారు. కొన్ని ప్రతిపాదిత రోడ్లు భవనాల మీదుగా, నీటివనరుల నుండి ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రస్తుత ప్లాన్‌లో వాటిని తొలగించడం జరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా మరో 500 ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులు కూడా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయనేది అధికారుల అభిప్రాయం. భవిష్యత్ రవాణా వ్యవస్థకు అనుగుణంగా, ప్రస్తుత వినియోగంలో ఉన్న రోడ్లను పరిగణలోకి తీసుకుని, ఆయా మార్గాల్లో రానున్న కాలనీలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు వంటి విషయాలను దృష్టిలోపెట్టుకుని రోడ్ల ప్రతిపాదనలు స మూలంగా మారనున్నాయని అధికారులు వెల్లడిస్తున్నా రు. 

ఆదాయం దిశగా హెచ్ ఎం డీ ఏఅడుగులు

అనుమతులు పొందిన లేఅవుట్ల వినియోగ కేటగిరీల ను కూడా ప్లాన్‌లో మార్చడం ద్వారా భవిష్యత్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలనేది అ థారిటీ అభిప్రాయం. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని రహదారుల ప్రతిపాదనలను మార్చనున్నట్టు సమాచారం.అయితే, ప్రస్తుతం మహానగరం, శివారు ప్రాంతాల్లో అమలులో ఉన్న హుడా, హడా, సిబిడి, ఎంసిహెచ్, ఓఆర్‌జిసి అనే ఐదు మాస్టర్‌ప్లాన్‌లను కలుపుతూ ఒకే నగరం ఒకే మాస్టర్‌ప్లాన్ ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశానుసారం ఇప్పుడు చిరంజీవులు ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్ 2041ను రూపొందిస్తున్నది విదితమే. అయితే, ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్ భవిష్యత్ తరాలకు మరింత ప్రయోజనకరంగా సిద్దంచేయాలన్నదే హెచ్‌ఎండిఎ ప్రధాన ఉద్దేశ్యం.మాస్టర్‌ప్లాన్2031లో రోడ్లకిరువైపుల భూవినియోగం విషయంలో ఏవిధమైన ప్రతిపాదనలు చేయలేదు. దీంతో అక్కడ వస్తున్న భవన నిర్మాణాలు, లేఅవుట్ల ద్వారా అభివృద్ధి రుసుంల రూపేణా రావాల్సిన ఆదాయం కాస్త ప్రక్కదారిపడుతోంది. ఇది గ్రహించిన కమిషనర్ చిరంజీవులు రహదారులకిరువైపుల భూవినియోగ కేటగిరీని మార్చాలని నిర్ణయించారు. నగరానికి చేరుకునే ప్రధానంగా జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ రహదారులకు ఇరువైపుల వ్యాపార, వాణిజ్య కేంద్రాలు వెలుస్తున్నాయి. కానీ, సంస్థకు అభివృద్ధి రుసుంలు మాత్రం వ్యాపార కేటగిరీ ప్రకారంగా రావడంలేదు. అంటే ఆ రహదారులకు ఇరువైపుల ఉన్న భూవినియోగ కేటగిరీ నివాసయోగం కేటగిరీలోనే ఉన్నది. దీంతో ప్రస్తుతం సమీకృత మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ రహదారులకు ఇరువపైలు 200 మీ.ల వరకు వ్యాపార సముదాయాలు నిర్మించుకునే విధంగా మల్టిపుల్ యూజ్ జోన్‌గా ప్రతపాదించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ నిర్మాణాలు అధికంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు వెలుస్తాయి. అందుకనుగుణంగా అనుమతులు వస్తాయి. తద్వారా నిర్మాణదారులకు కూడా రుణాలు, అద్దెలు అదే స్థాయిలో వస్తాయి. ఈ రహదారుల వెంట అభివృద్ధి కూడా ఒక ప్రణాళికా ప్రకారంగా జరుగుతాయనేది చిరంజీవులు భావన.

No comments:

Post a Comment