Breaking News

08/07/2019

ఆర్జీల పరిష్కారం వేగవంతం


ఒంగోలు, జూలై 08,(way2newstv.in):
జిల్లాలో స్పందన ప్రజావిజ్ఙప్తుల కార్యక్రమంలో ప్రజల నుండి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రకాశం భవనంలో గల కంట్రోల్ రూమ్ లో స్పందన కార్యక్రమం నిర్వహించి  ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వాటిలో కొన్నింటి వివరాలిలా వున్నాయి. కొత్తపట్నం మండలం, మోటుమాల గ్రామ నివాసి పి.వెంకటరావు తనకు 18 ఎకరముల భూమి వుంది. 1 బి అడంగల్ పహణిలో ఇన్ చార్జి తహాశీల్దారు వారు తన పేరును తొలగించినారని తెలుపుతూ రికార్డులను పరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరారు. దొనకొండ మండలం, యర్రపాలెం గ్రామ   నివాసి బత్తుల అచ్చమ్మ తనకు యర్రపాలెంలో 8 ఎకరముల భూమి కలదని సదురు భూమికి సర్కారు శిస్తు చెల్లించుకొనుచూ నా స్వాధీనములోనే యున్నది. యర్రం శెట్టి బ్రహ్మయ్య, బత్తుల వెంకటరమణమ్య, పోతురాజు వెంకట రామయ్యలు దురుద్దేశంతో తన భూమిని  దొంగపట్టాదారు పుస్తకము పుట్టించి వేరే వారికి ఇప్పించేలా చూస్తున్నారు. 

 ఆర్జీల పరిష్కారం వేగవంతం

ప్రభుత్వ రాకార్డులను పపరిశీలించి న్యాయం  చేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. వెలిగండ్ల మండలం పండువ నాగులవరం గ్రామ నివాసి తెడ్డుపాటి సాంబయ్య సర్వే నెం.364 లో విస్తీర్ణం 6 ఎకరముల 10 సెంట్ల కమ్మరి ఇనాం  భూమి కలదు. సదరు భూమిపై నాకు రైతువారిపట్టా మంజూరు చేసి గ్రామలెక్క 10(1) లో నందు నాపేరు మీద నమెదు అయినది. నాఖాతా నెం.789 గా రికార్డు నమెదు అయినది.  జాళ్లపాలెం గ్రామ వాస్తవ్యుడు దొడ్డు సుబ్బరాయడు 3 ఎకరముల 5 సెంట్ల భూమిని అన్యాక్రాంతంగా కబ్జా చేసి ఆక్రమించుకొన్నాడు. అంతె కాకుండా ఆన్ లైన్ లో రికార్డులు మార్పు చేసినారు. దయవుంచి సర్వే నె.364 లో 6 ఎకరముల 10 సెంట్ల భూమిని తన పేరుపై ఆన్ లైన్ చేసియిప్పించవలసినదిగా కోరారు. చీమకుర్తి మండలం చీమకుర్తి రాంనగర్ 7 వ లైను వాస్తవ్యులు చల్లా సుబ్బారావు తన వయస్సు 64 సంవత్సరములు. వడ్డెర కులమునకు చెందిన వాడను. ఒంగోలు మండలం  వెంగముక్రపాలెం గ్రామ నివాసి స్వర్ణ కరుణాకర్ సర్వే నెం. 144/1 లో గల 0.03 సెంట్ల స్ధలములో 2008లో రేకుల ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నాను. యిప్పటి వరకు ఇంటిపన్ను విధించలేదు. రెండు దఫాలుగా ఇంటిపన్ను కొరకు చలనా కట్టినాను. దయవుంచి నాయింటికి ఇంటిపన్ను విధించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పి.సి.పల్లి మండలం తలకొండ గ్రామ నివాసి రాయళ్ల ఆదిశేషయ్య గ్రామ  సర్వే నెం. 83/4 లో 4 ఎకరముల 6 సెంట్ల భూమిని తేది: 24.06.89 లో ప్రభుత్వము ,నిరుపేదలైన మాకు పట్టా యిచ్చి వున్నారు. అప్పటి నుండి సాగుచేసుకుంటూ జీవానం గడుపుచున్నాము. 2009లో పాలేటి పల్లి రిజర్వాయర్ కట్టుటకు ప్రభూత్వం ఆదేశాలు యిచ్చిందని కాని 05.02.2010 లలో అప్పటి సబ్ కలెక్టర్వచ్చి భూమిపై భూసేకరణ అనుమతులు తీసుకున్నారు. కాని మాకు నష్ట పరిహారం యివ్వలేదు. జాయింట్ కలెక్టర్ మాభూమిపైకి వచ్చి పరిశీలించి సంబంధిత ఫైలును తహశీల్దారు కు పంపమని తెలిపారు. తహశీల్ధారు వారు కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఫైలు పంపారు. , యిప్పటి వరకు కందుకూరు ఆర్.డి.ఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ కు పంపకుండా వుంచినారు. తమకు పరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సబ్బయ్య, స్పెషల్ కలెక్టర్ చంద్రమౌళి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment