Breaking News

11/07/2019

పవన్ ప్రసన్నం చేసుకొనేందుకు టీడీపీ ప్లాన్

ఏలూరు, జూలై 11, (way2newstv.in
జగన్ అత్యంత ప్రజాదరణ ఉన్న యువ నాయకుడు. ఆ సంగతి రాజకీయ చాణక్యుడు చంద్రబాబు కంటే తెలిసిన వారు ఎవరూ లేరు. అందుకే జగన్ ని ఆయన 2009లో వైఎస్సార్ మరణం తరువాత సీఎం కానీయకుండా తెర వెనక అడ్డుకున్నారంటారు. ఇక 2014 ఎన్నికల నాటికి ఏపీకి ముక్కలు చేసైనా జగన్ ను రాకుండా కాంగ్రెస్, బాబు కలిసి చేశారని చెబుతారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజీపేతో కలసి వెళ్ళిన చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ‌్ ను కూడా తోడు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురు కాంబో హిట్ అయినా జగన్ ను పూర్తిగా కట్టడి చేయలేకపోయారు. అన్ని సమీకరణలు కలసినా కూడా కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతోనే జగన్ అధికారం కోల్పోయారు.
పవన్  ప్రసన్నం చేసుకొనేందుకు టీడీపీ ప్లాన్
దానికి అసలు వడ్డీ కలుపుని మరీ యాభై శాతం ఓట్లు, 86 శాతం సీట్లతో జగన్ బంపర్ మెజారిటీతో తాజా ఎన్నికల్లో అధికారం సంపాదించుకున్నారు. ఇపుడున్న ఊపు చూస్తూంటే జగన్ మరో పదేళ్ళ వరకూ అధికారంలో ఉంటారని అంతా అంటున్నారు.సరిగ్గా ఇదే ఇపుడు మాజీ మిత్రులను కలవరపెడుతోందిట. ఏపీలో చంద్రబాబుని అధికారంలో నుంచి దించేశామనుకుంటున్న బీజేపీకి అంతకంటే మేకుని నెత్తిన పెట్టుకున్నామన్న సంగతి అర్ధమైందని కూడా చెబుతున్నారు. జగన్ సీఎం అయి ఇంకా కుదురుకోలేదు కానీ జగనే మా టార్గెట్ అని బీజేపీ అంటోందంటే వారికి జగన్ భయం ఎంతలా వెంటాడుతుందో అర్ధమవుతోంది. ఇక పవన్ని, ఆయన ద్వారా చిరంజీవిని దువ్వుతూ ఏపీలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ఏపీ రాజకీయ వాతావరణం ఇప్పటికైతే ఏ మాత్రం కలసిరాలేదనే చెప్పాలి. జగన్ దూకుడుగా చేస్తున్న రాజకీయం బీజేపీకి ఏపీలో చోటు లేదని చెప్పకనే చెబుతోంది.మరో వైపు టీడీపీ ఇపుడు వాస్తవ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకుంటోంది. మళ్ళీ ఒంటరిగా పోరులో దిగితే జగన్ చేతిలో భారీ పరాజయం తప్పదని ఆ పార్టీకి ఈ పాటికి అర్ధమైపోయింది. దాంతో కాపుల మద్దతు, సినీ గ్లామర్, యూత్ ఓట్లు ఇవనీ ఉన్న పవన్ ను మళ్ళీ దువ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇపుడు పవన్ అటు బీజేపీకి, ఇటు టీడీపీకి కావాల్సిన వారు అయ్యారు. ఈ ముగ్గురూ కేవలం నెల రోజుల వ్యవధిలోనే మెల్లగా ఒకే ఫ్లాట్ ఫారం మీదకు రావాలనుకుంటున్నారంటే రానున్న రోజుల్లో బాగా సన్నిహితమైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇప్పటికిపుడు కాకపోయినా బీజేపీతో దోస్తీ మళ్ళీ కలపాలని బాబు ఉబలాటం కూడా అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఎపుడూ ఒకేలా ఉండదు కాబట్టి బీజేపీ కూడా ఫక్త్ పాలిటిక్స్ చేసే పార్టీ అయినందువల్ల పాత మిత్రులు రేపటి రోజుల ఒకటి అయినా ఎవరికీ షాక్ మాత్రం కాదు. మరి జగన్ ఎంతటి బలవంతుడో ఈ మంతనాలు చెప్పకనే చెబుతున్నాయి

No comments:

Post a Comment