అమరావతి జూలై 23 (way2newstv.in)
మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ‘ఆకాశంలో సగం, అవనిలో సగం’ అని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పారు గానీ, మహిళలకు అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమే అని తాను ఘంటాపథంగా చెబుతానని వైసీపీ సభ్యురాలు రోజా అన్నారు.
నామినేటెడ్ పదవుల్లో మహిళలకు యాభై శాతం బిల్లు హర్షణీయం: రోజా
ఈరోజు శాసనసభలో ఆమె మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో సహా మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ యాభై శాతం కేటాయించే బిల్లులను ప్రవేశపెట్టడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని అన్నారు. మహిళలకు అవకాశాలిస్తే రాణించగలరన్న నమ్మకంతో ఈ బిల్లులను సీఎం జగన్ తీసుకొచ్చారని, మహిళలందరూ కూడా సంతోషపడే విషయమని చెప్పారు.
No comments:
Post a Comment