Breaking News

05/07/2019

హైద్రాబాద్ లో కోచింగ్ సెంటర్లు క్లోజ్

హైద్రాబాద్, జూలై 5 (way2newstv.in)
నిబంధనలకు విరుద్ధంగా, ఫైర్‌సేఫ్టీ లేని కోచింగ్ సెంటర్ల మూసివేత డ్రైవ్ కొనసాగింది. ఈ రోజు మూడు మార్గాల్లో 114 కోచింగ్ సెంటర్లను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఫైర్ నిబంధనలు, ఇతర భద్రతా చర్యలు పాటించాలని ఇప్పటికే పలుసార్లు నోటీసులు జారీ చేసినా ఖతరు చేయని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకున్నారు. 
 హైద్రాబాద్ లో కోచింగ్ సెంటర్లు క్లోజ్

మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి మార్గంలో 30 కోచింగ్ సెంటర్లపై, కూకట్‌పల్లి నుంచి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు మార్గంలో ఉన్న 46 కోచింగ్ సెంటర్లు, అశోక్‌నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్ వరకు ఉన్న 38 కోచింగ్ సెంటర్లు సీజ్ చేశారు.

No comments:

Post a Comment