Breaking News

01/07/2019

తెలుగు రాష్ట్రాల్లకు నూతన గవర్నర్లు


న్యూఢిల్లీ, జూలై 1, (way2newstv.in)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కొత్త గవర్నర్లను నియమించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్ స్థానంలో ఇద్దరు కొత్త వారిని నియమించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేయాలనుకుంటున్న పార్టీ అధినాయకత్వం మొదట ఏపీ, తెలంగాణకు ఇద్దరు గవర్నర్లను నియమించడం మంచిదని భావిస్తోంది. నరసింహన్‌ను మరింత కాలం ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగించటం మంచిది కాదన్నది హోం శాఖ అభిప్రాయం. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ పేరు పరిశీలనకు వచ్చిన సంగతి తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాల్లకు నూతన గవర్నర్లు

సుష్మాస్వరాజ్‌తోపాటు కిరణ్‌బేడీ పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయి జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు కూడా దాదాపుగా పూర్తి కావస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించటం మంచిదని కేంద్ర హోం శాఖ భావిస్తోందని అంటున్నారు. ఎక్కువ కాలం ఒకే గవర్నర్‌ను కొనసాగించడం రెండు రాష్ట్రాల ప్రజలు కూడా హర్శించకపోవచ్చునని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కలసి కట్టుగా ముందుకు సాగుతూ రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్, వైసీపీ ప్రాంతీయ కూటమిగా ఏర్పడినట్లుగా వ్వవహరిస్తున్నాయి. రెండు రాష్ట్రాల రాజకీయ, ఆర్థిక, అభివృద్ధి సంబంధమైన ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు సమైక్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వేర్వేరుగా గవర్నర్లు ఉండటం మంచిదని హోం శాఖ మంత్రి అమిత్ షా భావిస్తున్నారని అంటున్నారు. అమిత్ షా ఇటీవల తన సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు జీ కిషన్ రెడ్డితో కూడా కొత్త గవర్నర్ల నియామకం గురించి చర్చించారని అంటున్నారు.

No comments:

Post a Comment