Breaking News

30/07/2019

బ్లాక్ లిస్ట్ లో డ్రైవర్లు...

హైద్రాబాద్, జూలై 30, (way2newstv.in
పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా చేరిన చాలా మంది ఇప్పుడు ఉబెర్, ఓలా పైన ఆధారపడ్డారు. హైదరాబాద్ నగరంలో దాదాపు లక్ష మంది వరకు డ్రైవర్లు ఓలా, ఉబెర్ కార్లను నడుపుతున్నారు. కొంతమంది ఓలా నుంచి లీజు వాహనాలను నడుపుతున్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ లాంటి పథకాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాయితీల్లో కార్లను అందజేశారు. ఇలాంటి వారిలో చాలా మందికి ఉపాధి కల్పిస్తామని ఉబెర్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. దీంతో వేల సంఖ్యలో డ్రైవర్లు ఉబెర్ సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరికి డ్రైవింగ్ తప్ప మరో జీవనాధారం లేదు. అలాంటిదీ హఠాత్తుగా బ్లాక్ లిస్ట్ లో పెడితే తాము బతికేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. 
బ్లాక్ లిస్ట్ లో డ్రైవర్లు...

ఓలా, ఉబెర్ లాంటి సంస్థలు వచ్చిన తర్వాత ఆయా సంస్థలను కాదని ట్యాక్సీ నడిపించుకునే వారికి అస్సలు గిరాకీయే ఉండటం లేదని డ్రైవర్లు చెబుతున్నారు. బ్లాక్ లిస్ట్ లో చేరిన డ్రైవర్లు చేతిలో పనిలేక కుటుంబాన్ని పోషించటం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.లీజు డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఓలా సంస్థ ఇచ్చే కార్లను లీజు తీసుకొని వీరు జీవనాధారం పొందుతున్నారు. ఇందుకోసం ముందుగా రూ.35 వేలు అడ్వాన్స్ చెల్లించి…ఆ తర్వాత రోజుకు రూ.1135 కిరాయి కంపెనీకి చెల్లిస్తారు. ఇలాంటి వారికి 2 నుంచి 3 ఏళ్ల తర్వాత అదే కారును సెకండ్ హ్యాండ్ కారు ధరల్లో మరో 50 శాతం తగ్గించి మరీ ఓలా సంస్థ వారికే కారును విక్రయిస్తుంది. మూడేళ్లు ఇలా ఓలాలో కారు నడిపితే సొంతంగా తక్కువ ధరకు కారు కొనుక్కోవచ్చని చాలా మంది ఓలాలో కారు నడుపుతున్నారు. ఇలాంటి వారికి బ్లాక్ లిస్ట్ లో చేరిస్తే తాము అసలు కారు కొనే పరిస్థితి లేకపోగా ముందుగా కట్టిన 35 వేల రూపాయలు కూడా కోల్పోతున్నామని చెబుతున్నారు.క్రిమినల్ కేసులు ఉన్నవారిని కచ్చితంగా బ్లా క్ చేయాలి. కానీ కొంత మంది డ్రైవర్లపై కేసులు లేకున్నా మీరు ఆ పార్టీ ఈ సంఘంలో పనిచేస్తున్నా రంటూ బ్లా క్ లిస్ట్ లో పెడుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిం చాలనే ఉద్దేశంతో డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం పెట్టడంతో చాలా మంది ఉబెర్ లోడ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఇలా చిన్న కారణాలకే డ్రైవర్లను పక్కన పెడితే బతికేదేలా ? ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. డ్రైవర్లను బ్లా క్ చేయాలంటే ప్రభుత్వమే రూల్స్ రూపొందించాలి.

No comments:

Post a Comment