జిల్లా జాయింట్ కలెక్టర్ వనజా దేవి
పెద్దపల్లి జూలై 22 (way2newstv.in):
ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ వ్యాలెట్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. టీ వ్యాలెట్ వినియోగంపై రేషన్ డీలర్ల కు సోమవారం పెద్దపల్లి లోనే మాత్రం కళ్యాణ మండపంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి వనజా దేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ వ్యాలెట్ సేవలను ప్రవేశపెట్టిందని, ఆగస్టు మాసం నుండి రేషన్ దారులు రేషన్ బిల్లు చెల్లింపులు టీ వ్యాలెట్ ద్వారా జరిగే అవకాశం ఉంటుందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనే జేసీ తెలిపారు.
టీ వ్యాలెట్ సేవలను విస్తృతంగా ఉపయోగించాలి
టీ వ్యాలెట్ ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు సేవలు కోసం చెల్లింపులు చేయవచ్చని, టీ వాలెట్ ఫుల్ కేవైసీ కి అప్గ్రేడ్ జరిగిందని, టీ వ్యాలెట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం మన బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకోవాలని, దీని ద్వారా అ ప్రభుత్వ సంస్థలకు చెల్లింపులు నగదు బదిలీ, మొబైల్ ఫోన్ల రీఛార్జి, బస్ టికెట్ బుకింగ్, పోస్ట్ పెయిడ్ బిల్లు లాండ్ లైన్ బిల్లుల చెల్లింపులు, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపులు మొదలైనవి చేయవచ్చని జేసీ తెలిపారు. పౌరసరఫరాల శాఖ లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచి సంస్కరణలు తీసుకుని వచ్చాము అనే ఈపాస్ యంత్రాల ద్వారా పారదర్శకంగా ప్రజలకు రేషన్ అందిస్తున్నామని, రేషన్ డీలర్లు వినియోగంలో ముందుండాలని ప్రస్తుతం అందించే శిక్షణను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొనే దానిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, టీ వాలెట్ యాప్ నిర్వహించడానికి ఎలాంటి సర్వీసు చార్జీలు ఉండవని, పూర్తి ఉచితంగా టీ వ్యాలెట్ వినియోగించుకోవచ్చని జెసి సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి తోట వెంకటేశం, జిల్లా మేనేజర్ పౌరసరఫరాల సంస్థ ప్రవీణ్ , ఈడియం కవిత, సాంకేతిక నిపుణులు రాజేశం, రేషన్ డీలర్లు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment