Breaking News

19/07/2019

టాప్ లేచిన స్మార్ట్ శంకర్ కలెక్షన్స్

హైద్రాబాద్, జూలై 19, (way2newstv.in)
పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ శంకర్’ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పూరీ టేకింగ్, రామ్ నటన, నిధి అగర్వాల్, నభా నటేశ్ అందాల ఆరబోత ప్రధానాకర్షణగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలుండటంలో టాక్‌ సంబంధం లేకుండా కలెక్షన్లలో దూసుకుపోతోంది.వరల్డ్‌వైడ్‌గా 900 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.16కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సినీ ట్రేడ్ అనలిస్ట్ బీఏ రాజు ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్‌డే రూ.7.8కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రామ్ కెరీర్లోనే ఫస్ట్ కలెక్షన్లలో రికార్డు నెలకొల్పింది. 
 టాప్ లేచిన స్మార్ట్ శంకర్ కలెక్షన్స్

అయితే సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి ఎన్నిరోజులు నిలకడగా నిలబడుతుందన్నది చూడాలి. పక్కా హైదరాబాద్‌ కుర్రాడిగా రామ్ నటన మెప్పించినా... వీకెండ్ తర్వాత ఇస్మార్ట్‌గా కలెక్షన్లు రాబడతాడో లేదా చూడాలి మరి. 
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా షేర్ కలెక్షన్లు.. 
నైజాం- రూ.3.43కోట్లు 
సీడెడ్- రూ.1.2కోట్లు 
ఈస్ట్- రూ.50లక్షలు 
వెస్ట్- రూ.40లక్షలు 
కృష్ణా- రూ.53లక్షలు 
గుంటూరు- రూ.57లక్షలు 
నెల్లూరు- రూ.30లక్షలు 
మొత్తం షేర్ కలెక్షన్స్.... రూ.7.8కోట్లు

No comments:

Post a Comment