Breaking News

24/07/2019

కేటీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

హైద్రాబాద్, జూలై 24  (way2newstv.in):
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని, అవసరంలో ఉన్నవారికి సాయంచేయాలని పార్టీశ్రేణులు, అభిమానులకు కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు, వయో వృద్ధులకు తమ వంతు సాయం చేస్తున్నామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, దానం నాగేందర్, బాల్క సుమన్ విషెస్ చెప్పారు. 
కేటీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ఆకాంక్షించారు నేతలు.  తెలంగాణ భవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు కార్యకర్తలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రక్తదానం చేశారు. కేటీఆర్ యువతకు మార్గదర్శి అన్నారు మంత్రి తలసాని. చిన్న వయసులోనే ఎంతో పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. దేశంలోనే విలక్షణమైన నాయకుడుగా అభివర్ణించారు ఎమ్మెల్యే బాల్క సుమన్. ఐటీ మంత్రిగా హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచారని చెప్పారాయన. కేటీఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు దానం నాగేందర్.కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పండ్లు, ఆహారం పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని ఇప్పటికే పిలుపునిచ్చారు కేటీఆర్. ఆపద, అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులన కోరారు కేటీఆర్. కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు, వయో వృద్ధులకు తమ వంతు సాయం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కే.పి.వివేకానంద ఆధ్వర్యంలో కుత్బాల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా ముఖ్ర కె గ్రామ వైకుంఠదామంలో గ్రామస్తులు 500 మొక్కలు నాటారు.
మొక్క నాటిన నితిన్
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. అంతేకాదు ఈ ఛాలెంజ్‌ని ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్‌ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. ఈ క్ర‌మంలో ఛాలెంజ్‌ని స్వీక‌రించిన‌ హీరో నితిన్ త‌న పెర‌ట్లో ఓ మొక్క‌ని నాటాడు. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ అనే కార్య‌క్ర‌మం మంచి ప్ర‌య‌త్నం. ఇలాంటి సామాజిక బాధ్య‌త‌లో న‌న్ను భాగం చేసినందుకు సంతోష్ కుమార్ గారికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాను. మన ప్రపంచాన్ని అందంగా మార్చడంలో మా బాధ్యతలు గుర్తుచేసే ఏ సవాలునైనా స్వీక‌రించ‌డానికి ఎల్లప్పుడూ సిద్ధమే. నా ప‌ని పూర్తి చేశాను. ఇప్పుడు మీ( ఫాలోవ‌ర్స్) స‌మ‌యం ఆస‌న్న‌మైంది. హ్యాపీ బ‌ర్త్ డే కేటీఆర్ గారు అని నితిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. నితిన్ ప్రస్తుతం రంగ్ దే, బీష్మ చిత్రాలతో పాటు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు
యువతకు కేటీఆర్ రోల్ మోడల్
యువతకు మార్గదర్శి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రక్తదాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కేటీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. కేటీఆర్ యువతకు మార్గదర్శి అన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో యువతను కేటీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలోనే విలక్షణమైన నాయకుడు కేటీఆర్ అన్నారు. ఐటీ మంత్రిగా హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచారన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ.. కేటీఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు.

No comments:

Post a Comment