Breaking News

15/07/2019

పోలవరం అవినీతిపై నివేదికలు రాలేదు

న్యూఢిల్లీ, జూలై 15  (way2newstv.in)
పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటు చేసుకుందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతిపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారం  చర్చ జరిగింది. వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పోలవరం అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించే ఆలోచన ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
పోలవరం అవినీతిపై నివేదికలు రాలేదు

పోలవరం నిర్మాణానికి ఆర్థిక శాఖ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందని అడిగారు. నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా... రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎస్టిమేట్స్ కమిటీ ఎప్పుడు ఆమోదం తెలుపుతుందని అడిగారు.  విజయసాయి ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. సీబీఐ విచారణకు అవకాశం లేదని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment