Breaking News

27/07/2019

ముందుకు సాగని మడ

విజయవాడ, జూన్ 27, (way2newstv.in)
బందరు ఓడరేవు భూముల సేకరణ విషయంలో భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేసేందుకు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ హామీతో వివిధ బ్యాంక్ నుండి రూ.1385 కోట్లు రుణం పొంది ఆ మొత్తాన్ని భూములు ఇచ్చే రైతులకు పరిహారంగా చెల్లించనున్నారు. ప్రభుత్వ హామీతో ప్రైవేట్ బ్యాంక్‌ల నుండి రుణం పొందేందుకు గత మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడగా ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలను ముడ అధికారులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. భూములు ఇచ్చే రైతులకు ఎంత మేర పరిహారం చెల్లించాలనే అంశం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 
ముందుకు సాగని మడ

పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో రైతులందరికీ సమాన న్యాయం చేసేందుకు గాను ఎకరానికి రూ.22లక్షలు పరిహారంగా చెల్లించేందుకు ముడ అధికారులు ధర నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కూడా తెలియచేశారు. పలు గ్రామాల్లో మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ.15లక్షలు పలుకగా మరికొన్ని గ్రామాల్లో రూ.25 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అందరికీ ఒకే విధంగా పరిహారం చెల్లించేందుకు గాను మధ్యస్థంగా రూ.22లక్షల ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో ధర నిర్ణయానికి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశమై పరిహారం ధర నిర్ణయంపై ఆమోద ముద్ర వేయనుంది. ఆ తర్వాత గ్రామాల్లోకి వెళ్లి భూమి కొనుగోలు పథకం ద్వారా ముందుకు వచ్చిన రైతుల భూములకు పరిహారం చెల్లించి భూముల సేకరణ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇదిలా ఉండగా బ్యాంక్ నుండి రుణం పొందేందుకు ముడ అధికారులు డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీని నెదర్లాంద్‌కు చెందిన కెపిఎమ్‌జి సంస్థకు అప్పగించారు. ఈ సంస్ధ మరో వారం రోజుల్లో డీపీఆర్ రిపోర్టును అందచేయనుంది. ఈ రిపోర్టు ఆధారంగా బ్యాంకర్లు ప్రభుత్వ హామీతో రైతులకు పరిహారంగా చెల్లించేందుకు గాను రూ.1385కోట్లు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటికే పూలింగ్‌లో సేకరించిన 3100 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను కూడా ముడ అధికారులు బ్యాంకర్లకు షూరిటీగా చూపించనున్నారు. ఈ ప్రక్రియ అంతా నెల రోజుల్లో పూర్తి కానుంది.

No comments:

Post a Comment