Breaking News

16/07/2019

పర్యాటక రంగంలో చైనా ఆర్ట్స్ అసోసియేషన్ పెట్టుబడులు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ జూలై 16  (way2newstv.in)
చైనా దేశపు ప్రభుత్వరంగ సంస్థ చైనా ఆర్ట్స్ అసోసియేషన్ కు చెందిన ప్రతినిధులతో పాటు పర్యాటక శాఖ యం.డి. మనోహర్ రావు, పురంధర్, పర్యాటక శాఖ అధికారులతో సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు.చైనా ఆర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు సచెంగ్ వెయి వాంగ్లీ సురేష్ విజయన్,  ఆసగర్ అలీ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక  పర్యాటక ప్రాంతాలు అయిన గోల్కొండ , రామోజీ ఫిలిం సిటీ , హుస్సేన్ సాగర్,   లుంబిని పార్కులను పర్యాటక శాఖ యం.డి. మనోహర్ రావు, పురంధర్, పర్యాటక శాఖ అధికారులతో కలసి పర్యటించారు. 
పర్యాటక రంగంలో చైనా ఆర్ట్స్ అసోసియేషన్ పెట్టుబడులు: శ్రీనివాస్ గౌడ్

చైనా ఆర్ట్స్ అసోసియేషన్ తరపున హుస్సేన్ సాగర్ , పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సచివాలయంలో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా గత రెండు రోజుల నుండి  చైనాకు చెందిన ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించారని, ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్రం అందులో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనపరిచారని వారి ఆసక్తిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి ప్రతిపాదనలను పరిశీలిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. చైనా ఆర్ట్స్ అసోసియేషన్ చెందిన ప్రతినిధులు హుస్సేన్ సాగర్ లోని రోప్ వే, కేబుల్ పాడ్ కార్, వాటర్ స్పోర్ట్స్ తదితర పర్యాటకులను ఆకట్టుకునే యాక్టివిటీస్ కోరకై తగు ప్రతిపాదనలతో రావాలని మంత్రి చైనాకు చెందిన ప్రతినిధులకు సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం తాగునీరు, విద్యుత్తు, సమతుల్య వాతావరణం వల్ల హైదరాబాద్ నగరం సాఫ్ట్వేర్ , హార్డ్వేర్ లతో పాటు ఫార్మా రంగంలో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నగరంగా అభివృద్ధి సాధించిందన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు వస్తున్నారు. చైనాకు చెందిన చైనా ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్లు హుస్సేన్ సాగర్ తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి వెల్లడించారు.

No comments:

Post a Comment