Breaking News

03/07/2019

బోనాలపై మంత్రి సమీక్ష


సికింద్రాబాద్ జూలై 3 (way2newstv.in)
సికింద్రాబాద్  ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర విశ్వవ్యాప్త మయ్యింది, గత సంవత్సరం కంటే కూడా కనీవినీ ఎరుగని రీతిలో జాతర జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.. బుధవారం ఉజ్జయిని దేవాలయంలో బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి , జీహెచ్ ఎంసీ కమిషనర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..  

బోనాలపై మంత్రి సమీక్ష

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నగరంలోని దేవాలయాలలో పండుగ అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఈ నెల 15వ తేదీ లోపే దేవలయాలన్నిటికి డబ్బులు అందచేస్తుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విదంగా దేవాలయాలకు పండుగను ఘనంగా జరుపుకోవాలని డబ్బులిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.. 50సంవత్సరాల నుండి బోనాల జాతరను రాష్ట్ర పండుగ చేయాలని కోరిన పట్టించుకోలేదు.. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్బంగా బోనాల జాతరను ప్రకటించిన ఘనత కేసీఆర్ ది అని తెలిపాడు.. పండుగ విజయవంతం కావడంలో వివిధ శాఖల అధికారులతో పాటు పోలీసులది కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది అని కొనియాడారు. 

No comments:

Post a Comment