Breaking News

27/07/2019

కామారెడ్డి లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

కామారెడ్డి జూలై  27, (way2newstv.in)
కామారెడ్డి జిల్లాలో  అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్ండంగా అయన కామారెడ్డి రాశివనంలో మొక్కలు నాటారు. 2015 లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటిన మొక్కను పరిశీలించి, ఆ చెట్టు వద్ద ఫోటో దిగారు.  మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం  5వ విడత హరిత హారం కార్యక్రమంలో 83 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 
కామారెడ్డి లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

నర్సరీల్లో 100 కోట్ల మొక్కలు పెంచుతున్నాం. 24 శాతం ఉన్న అడవులు 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళుతున్నామని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కీసర రిజర్వు ఫారెస్ట్ ఏరియా ను దత్తత తీసుకుని, ఎంపీ నిధులతో దాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. అడవుల పెంపకానికి రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావాలి. హరితహరాన్ని ప్రతి ఒక్కరూ  ఓ ఉద్యమంలా చేపట్టి విరివిగా మొక్కలు నాటాలని అయన అన్నారు. 

No comments:

Post a Comment