Breaking News

08/07/2019

దశ, దిశ వుండేలా వ్యవసాయం


రైతు దినోత్సవంలో సీఎం జగన్
జమ్మలమడుగు, జూలై 8 (way2newstv.in
రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని, అందుకే, రైతుల కోసం వైఎస్ ఆర్ భరోసా పథకం ప్రవేశపెడుతున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  అన్నారు. సోమవారం నాడు కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైత దినోత్సవ సభలో అయన పాల్గోన్నారు.  జగన్ మాట్లాడుతూ  సభలో సీఎం మాట్లాడుతూ… వైఎస్ ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.12,500లు ఇస్తామన్నారు. అక్టోబర్ 15నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నారు. రైతు భరోసా కింద రూ.8,750కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించడానికి ల్యాబ్స్ పెడతామన్నారు.,

దశ, దిశ వుండేలా వ్యవసాయం

ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పారు.  .ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పగటి పూటే 9గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. 60శాతం ఫీడర్లు ఉచితంగా పగటిపూట 9గంటల విద్యుత్ సరఫరాకు అవకాశముందన్నారు. మిగిలిన 40శాతం ఫీడర్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలంటే రూ.1700కోట్లు ఖర్చవుతాయన్నారు. వెంటనే 40శాతం ఫీడర్లకు రూ.1700కోట్లు మంజూరు చేశామన్నారు.వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కింద అవ్వా తాతాలకు రూ.2,250 అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్, డయాలసిస్ పేషెంట్లకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లను పెన్షన్ కింద ఇస్తున్నామని, అధికారంలోకి వచ్చిన నెల లోపే కేటాయించామని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి నేరుగా సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటికే చేరతాయని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తోందని, ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే 3 రెట్లు ఎక్కువ వైసీపీ సర్కర్ ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. ఇకపై జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఉండదన్నారు. పెన్షన్ మంజూరు చేయాలంటే లంచాలు ఉండవని సీఎం జగన్ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment