Breaking News

04/07/2019

వంద కోట్లతో అస్ట్రమ్ కంపెనీ


విజయవాడ, జూలై 4, (way2newstv.in)



ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన అస్ట్రమ్ కంపెనీ... కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఉన్న అస్ట్రమ్ కంపెనీ.. ఆంధ్రప్రదేశ్ లో 100 కోట్ల పెట్టుబడి,1000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్న అస్ట్రమ్ కంపెనీ... తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల లో కంపెనీ ఏర్పాటు కు అంగీకరించిన అస్ట్రమ్ ... ఆడియో పరికరాలు,ఎల్ఈడి లైట్లు,సెల్ ఫోన్ మరియు ల్యాప్ టాప్ యాసిసరీస్,కంప్యూటర్ కంపోనెంట్స్ ,గేమ్ కంట్రోలర్స్ తదితర కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ లో ఉన్న అస్ట్రమ్ .
వంద కోట్లతో అస్ట్రమ్ కంపెనీ

ప్రస్తుతం షేన్ జెన్  లో ఉన్న ఫ్యాక్టరీ లో వివిధ కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తున్న అస్ట్రమ్ ...మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ సెక్రెటరీ విజయానంద్ మరియు అస్ట్రమ్ కంపెనీ సిఈఓ మనోజ్.. కంపెనీ సిఈఓ మనోజ్ కుమార్ ,డైరెక్టర్ అలోక్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా మారుతుంది... రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు... కేవలం నాలుగేళ్లలో దేశంలో తయారు అవుతున్న 100 ఫోన్లలో ప్రస్తుతం 26 ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో తయారు అవుతున్నాయి... ఫాక్స్ కాన్ ఒక్క చోటే ఇప్పుడు 15,300 మంది మహిళలు పనిచేస్తున్నారు... సెల్ కాన్,డిక్సన్ ప్రారంభం అయ్యాయి.త్వరలోనే కార్బన్ కూడా ప్రారంభం కాబోతోంది...త్వరలోనే రిలయన్స్ జియో ఎలక్ట్రానిక్స్ పార్క్ ని తిరుపతిలో ఏర్పాటు చేయబోతోంది.సుమారుగా 25 వేల మందికి అక్కడ ఉపాది వస్తుంది... శ్రీ సిటీ లో ఫ్లెక్స్ ట్రానిక్స్ ప్రారంభం కాబోతోంది అక్కడ మరో 6,600 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి... అమరావతిలో ఇన్వెకాస్ చిప్ డిజైన్ పార్క్ ఏర్పాటు చేస్తుంది.చిప్ డిజైనింగ్ లో 5 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి... దేశంలో వియోగిస్తున్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్ లో తయారు అవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం... దానికి అనుగుణంగా దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఇచ్చాం,రాయితీలు కల్పిస్తున్నాం... ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నాం.. ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్ నుండి బ్యాటరీ తయారీ వరకూ అన్ని ఓకే చోట తయారు అయ్యేలా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు...

No comments:

Post a Comment