Breaking News

29/07/2019

గుంతలు సరే.. కాసులేవీ.?(కరీంనగర్)

కరీంనగర్,  జూలై 29  (way2newstv.in - Swamy Naidu): 
వృథా నీటికి అడ్డుకట్ట వేసి భూమిలోకి ఇంకించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఊరు వాడలా ఉద్యమ తరహాలో ప్రచారం చేస్తూ..ప్రగతి లక్ష్యాలను అధిగమించే ప్రణాళిక రూపొందించింది. మురుగు కాలువ వ్యవస్థకు స్వస్తి పలికి స్వచ్ఛత వాతావరణం కల్పించే ఉద్దేశంలో దీన్ని అమలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారానికి తెర తీశారు. పాఠశాల విద్యార్థుల సహకారంతో తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారుల ప్రయత్నం ఫలిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఒక్కో ఇంకుడు గుంతకు సుమారు రూ.4 వేలకు పైగా మంజూరు చేస్తుండటతో ప్రతి ఇంటిలో గుంతల తవ్వకాలు చేపడుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ వీటి నిర్మాణ బిల్లుల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. 
గుంతలు సరే.. కాసులేవీ.?(కరీంనగర్)

జిల్లాలోఏకకాలంలోనిర్మాణాలుప్రారంభించడంతోగుంతకువినియోగించరింగ్‌(గోళం)ల కొరత ఏర్పడింది. స్థానికంగా గోళాలు అందుబాటులో లేకపోవడంతో పొరుగు జిల్లాలైనా జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల వైపు పరుగు తీస్తున్నారు. ప్రజలపై రవాణాభారం పడుతోంది. చాలాచోట్ల గుంతలు తవ్వుకుని గోళాల కోసంనిరీక్షిస్తున్నారు. భూగర్భజలల శాతం పెంచే ఈ పథకంలో లోపాలను సరిదిద్దితేనే ప్రగతి లక్ష్యాలు నెరవేరుతాయి. జనావాసాల్లో మురుగు కూపాలతో అపరిశుభ్ర వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండటంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇళ్లలోని వృథా నీటిని భూమిలోకి  ఇంకించేందుకు ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి మంజూరు చేస్తున్నారు. రూ. 4062 లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.  దీనిలో రూ.771 కూలీలకు, మిగిలిన రూ.3206 సామగ్రి కోసం వెచ్చిస్తున్నారు. 1.2 మీటరు పొడవు, వెడల్పు, 1.8 మీటరు లోతులో దీన్ని నిర్మించాల్సి ఉంది. గుంత తవ్వి అడుగున్నరలోతు వరకు 250 ఎంఎం కంకర, మరో అడుగున్నర 20 ఎంఎం కంకర చూర్ణంతో నింపాలి. ఆ తర్వాత మూడు అడుగుల గోళం వేసి దానిపై భూమికి సమాంతరంగా కంకర నింపి వదిలేయాలి.  ఇంటిల్లో వినియోగించి నీరు దీనిలో వెళ్లేందుకు పైపు, ఛాంబర్‌ నిర్మించాలి. భూగర్భజలాలు పాతాళంలోకి పడిపోతుండంతో విపత్తు సంభవిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. భూగర్భంలోకి నీటిని ఇంకించే ఉద్ధేశంతో చేపట్టినఇంకుడుగుంతలతవ్వకానికప్రజాస్పందనలభిస్తోంది.క్షేత్రస్థాయిలోపర్యవేక్షణముమ్మరం చేయడంతో ఫలితం వస్తోంది. గుడిసెల్లో నివసించే వారు కూడా ఆసక్తిచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 31,542 ఇంకుడు గుంతలు నిర్మించేందుకు లక్ష్యాలను నిర్ణయించారు. పెద్దఎత్తున చైతన్యం చేస్తుండటంతో ఇప్పటి వరకు 16,612 ఇంకుడు గుంతలనిర్మాణం పూర్తయింది. 12,860 ప్రగతిలో ఉండగా 2070 చోట్ల పనులు ప్రారంభం కాలేదు.ఆరుబయలు బహిరంగ మల,మూత్ర రహిత జిల్లా సాధనలో అధికార యంత్రాంగం స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేసింది. దేశంలోనే మంచి ప్రగతి సాధించిన జిల్లాగా పేరు రావటంతో ఇదే స్ఫూర్తితో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలనే ప్రచారంతో ప్రజలు ముందుకొచ్చి గుంతలు తవ్వుకుంటున్నారు. జిల్లాలో సిమెంట్‌ గోళాల కొరతవెంటాడుతోంది. వీటిని సమకూర్చుకునేందుకు పొరుగు జిల్లాలకు తరలివెళ్లుతున్నారు. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్‌ డబ్బాలను వినియోగిస్తున్నారు. దీని వల్ల ఎలాంటిఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నా ప్లాస్టిక్‌ హానికరమేనంటూ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకుడు గుంతల బిల్లుల చెల్లింపులో జాప్యం నెలకొంది. కొన్నాళ్లుగా బిల్లుల మంజూరులో నిర్లక్ష్యం చేస్తున్నారు. కూలీల వాటా మంజూరు చేస్తుండగా సామగ్రి కోసం వెచ్చించే నిధుల విడుదలకు మోక్షం లేదు. దీంతో లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బపడుతున్నారు. జిల్లాలో రూ. కోటిన్నర వరకు బిల్లులు రావాల్సి ఉండగా వీటిల్లో సగం వరకు పాత బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సామగ్రి కొనుగోలు కోసం ఆర్థికభారం పడుతోంది. సకాలంలో బిల్లులు మంజూరు చేస్తే ప్రగతి లక్ష్యాలు చేరుకునే అవకాశం ఉంది. అప్పుడే లబ్ధిదారుల ఆర్థిక సమస్యలు తొలగుతాయని భావిస్తున్నారు.

No comments:

Post a Comment