Breaking News

17/07/2019

కొత్త మున్సిపల్ చట్టం...

ఇవాళ, రేపు,  ప్రత్యేక అసెంబ్లీ
హైద్రాబాద్, జూలై 17, (way2newstv.in)
కొత్త ము న్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశమై బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలోని పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే సచివాలయం తరలింపుపై ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ నివేదికపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణాలకు సంబంధించిన నమూనాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. 
కొత్త మున్సిపల్ చట్టం...

వీటితోపాటు రెవిన్యూ శాఖలో నెలకొన్న అవినీతిపై ఈ సమావేశంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల కోసం ఈ నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అయిం ది.రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం తీసుకురావడానికి ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలోనే అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నరసింహన్ తరఫున నోటిఫికేషన్ విడుదలచేశారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, మరుసటిరోజు (జూలై 19న) మధ్యాహ్నం 2 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మొదటిరోజు నూతన మున్సిపల్ చట్టం బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. ఆ బిల్లు ప్రతులను ఎంఎల్‌ఎలకు అందించనున్నారు. 19వ తేదీన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలుపనున్నది. ఆ తర్వాత ఈ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టి బిల్లుపై చర్చ జరిపిన తర్వాత మున్సిపల్ బిల్లుకు శాసనమండలి ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మున్సిపల్ బిల్లు ముసాయిదాకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికి న్యాయశాఖకు పంపించారు.

No comments:

Post a Comment