Breaking News

30/07/2019

పెసర 65 శాతం, వరి 2 శాతమే సాగు

ఖమ్మం, జూలై 30, (way2newstv.in - Swamy Naidu)
ఉభయ జిల్లాల్లో రైతులు ప్రస్తుతం పత్తి, పెసర పంటలకు ప్రాధాన్యం కల్పించారు. ఆరుతడి పంటలకు వారం, పది రోజులకు నీటి తడులు అవసరం. పంట విత్తనం ఆధారంగా కనీసంగా పక్షం రోజులకోసారి అయినా తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఆరుతడి పంటలు పండించే రైతులకు వర్షాలే జీవన ఆధారం. క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం కలిగినప్పుడే రైతులు పంటలు వేయడం ప్రారంభించడం ఆనవాయతీమిగతా పంటల కంటే పెసర గరిష్ఠంగా 65.4 శాతం సాగైంది. ఆ తర్వాత 49.3 శాతంతో పత్తి నిలిచింది. చెరుకు 27.1 శాతం, కందులు 11.0 శాతం, మొక్కజొన్న 6.7 శాతం, వరి కేవలం 1.4 శాతం మాత్రమే నమోదైంది. తాజాగా వర్షాలు ఊపందుకున్నాయి.  ఏటా జులై ఆఖరివారం, ఆగస్టులో విపరీతంగా వర్షాలు కురవడం గత మూడేళ్లుగా చూస్తున్నాం. 
పెసర 65 శాతం, వరి 2 శాతమే సాగు

ఈక్రమంలో వివిధ రకాల పంటల సాగుకు రైతులు అమితంగా మొగ్గుచూపే అవకాశం ఉంది. తాజాగా వర్షాలు వరుసగా కురుస్తుండటంతో సాధారణ సాగు లక్ష్యం దిశగా రైతులు అడుగులు వేస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు. జిల్లాలవారీగా సాగు విధానం పరిశీలిస్తే ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో సాధారణ సాగు 2,32,707 హెక్టార్లకు 57,620 హెక్టార్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ సాగు 1,20,082 హెక్టార్లు కాగా 41,997 హెక్టార్లు సాగుకు నోచుకుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా కంటే కొంచెం మెరుగ్గా ఉంది. జిల్లాలో వివిధ రకాల పంటలు 34.45 శాతం వేశారు. ఇక్కడ పత్తి 65.37 శాతం సాగై మొదటి స్థానంలో ఉంది. తర్వాత చెరకు 58.29 శాతం, మొక్కజొన్న 35.4 శాతం, పెసర 32.6 శాతం, కంది 14.33 శాతం, వరి 1.42 శాతంగా గుర్తించారు. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినప్పటికీ 50 శాతానికి మించి పంటలు సాగుకు నోచుకోలేదు.ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు సుమారు 2.52 లక్షల ఎకరాలు. సాగర్‌ జలాశయం నిండి దిగువకు నీటిని వదిలితేనే ఈ ఆయకట్టు తడిసేది.పాలేరు జలాశయానికి నీరు చేరిన తర్వాత ఎడమ కాలువ నుంచి నీటి సరఫరా వైరా జలాశయం మీదుగా కొనసాగుతుంది. సాగర్‌ ఆయకట్టులో బోరుబావులున్న రైతులు నారు పోసుకొని నీటికోసం ఎదురు చూస్తుంటే.. మెజారిటీ రైతులు సాగర్‌ నీటి కోసం ఎదురుచూస్తున్నారు.ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కారణాలు అన్వేషిస్తే వర్షాలు సకాలంలో కురవకపోవడం ఆరుతడి పంట వైపు రైతులను అడుగు వేసేలా చేసింది.పెసర  తేలికపాటి వర్షాలకు, మంచుకే పంట పండుతుంది. దీంతో రెండో ప్రాధాన్య క్రమంలో రైతులు ఆ వైపు మొగ్గు చూపారు. నీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్న, చెరుకు సాగుకు ఉపక్రమించారు.ఉభయ జిల్లాల్లో గత నెలన్నర రోజులుగా తీసుకుంటే ఎక్కువ వర్షం పడింది. ఆ పడే వర్షం ఒకేసారి పడటం, సకాలంలో పడకపోవడం పంటలు విత్తే అంశంపైన ప్రభావం చూపుతోంది.ఖమ్మం జిల్లాలో జూన్‌లో 08 రోజులు, జులైలో ఇప్పటి వరకు 15 రోజులు వర్షం కురిసింది. జూన్‌లో సాధారణ వర్షం 105.0 కాగా 183.0 మి.మీలు, జులైలో సాధారణం 201.8 మి.మీ కాగా 240 మి.మీ కురిసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్‌లో 09 రోజులు, జులైలో 15 రోజులు వానలు పడ్డాయి. జూన్‌లో సాధారణ వర్షం 144.8 మి.మీ కాగా 202.4 మి.మీ లు, జులైలో సాధారణ వర్షం 244.0 మి.మీ కాగా 349.2 మి.మీ కురిసింది.

No comments:

Post a Comment