Breaking News

24/07/2019

హైద్రాబాద్ లో 19 టీఓడీలు దిశగా అడుగులు

హైద్రాబాద్, జూలై 24, (way2newstv.in)
ప్రపంచస్థాయి నగరాల వరుసలో హైదరాబాద్ మహానగరాన్ని నిలిపే దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండిఎ) అడుగులువేస్తుంది. రవాణా వ్యవస్థకు మరిన్ని మెరుగులు పెట్టాలని…అందులో భాగంగానే దేశవిదేశాల్లో పేరున్న నగరాలు, మహానగరాలలోని జనాభను, విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని నగరం చుట్టూర అభివృద్ధి ప్రథకాలను ప్రతిపాదించాలని భావిస్తుంది. ముఖ్యంగా రవాణాధారిత అభివృద్ధికి పెద్దపీట వేయాలని నిర్ణయించింది.త్వరలోనే కార్యరూపంలోకి రానున్న భూ సమీకరణ పథకం ద్వారా రహదారుల వ్యవస్థ, ప్రణాళికా ప్రకారంగా పార్కింగ్ సదుపాయాలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, వినియోగం వంటివి ప్రజలకు అందించేందుకు మరింత మెరుగుపరచాలని, వీటికి ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు కూడా అధిక ప్రాధాన్యతనివ్వాలని అథారిటీ యోచిస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ నగరాల్లో ఉన్న రవాణాధారిత అభివృద్ది  లను నగర శివారులో ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్దచూపాలని గతంలోనే సాంకేతిక సలహా మండలి  సమావేశంలో ప్రతిపాదించిన విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 
హైద్రాబాద్ లో 19 టీఓడీలు దిశగా అడుగులు

హెచ్‌ఎండిఎ అధికారుల బృందం కెనడా, నార్వే, నెథర్లాండ్స్ వంటి దేశాలను సందర్శించి అక్కడి రవాణా వ్యవస్థను అధ్యయనం చేసింది. అనంతరం ఇక్కడ కూడా అదే తరహాలో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి నగర వాసులకు మెరుగైన ప్రయాణ సదుయాపాయాలను అందించాలని 2011లో లీ అసోసియేట్స్ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా హెచ్‌ఎండిఎ పరిధిలో సమగ్ర రవాణా అధ్యయనంను ప్రత్యేకంగా చేపట్టింది. ఆ కన్సల్టెన్సీ సిటిఎస్ నివేదికను అప్పటి ప్రభుత్వానికి అందించింది.అయితే, హెచ్‌ఎండిఎ విస్తరిత ప్రాంతంలోని అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులపై అధ్యయనం చేపట్టి నివేదికను గతంలోనే అందజేసింది. అథారిటీ ప్రాంతంలో ప్రపంచస్థాయి రవాణా సౌలభ్యాన్ని అందించేందుకు ఆ నివేదికలో మూసాపేట్, సరూర్‌నగర్‌లలో పార్కింగ్ భవనాలను ఏర్పాటుకు ప్రతిపాదించింది. దేశవిదేశాల్లోని ప్రముఖ నగరాల విస్తీర్ణం, జనాభ, ప్రతి చ.కి.మీ.కు ఉన్న జనసాంద్రతను పరిగణలోకి తీసుకుని అం దుకు అనుగుణంగా ఉన్న రవాణా వ్యవస్థను పరిశీలించడంతో అథారిటీ పరిధిలోనూ అత్యాధునిక రవాణాధారిత వ్యవస్థను అథారిటీ ప్రతిపాదిస్తుంది.విస్తరిత ప్రాంతంలో విధానాలు, నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారంగా కొత్తగా 19 ప్రదేశాల్లో రవాణాధారిత అభివృద్ధి(టిఓడి)లను అథారిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నది. హైటెక్‌సిటి -రాయదుర్గ్, మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, భరత్‌నగర్, అమీర్‌పేట్, , ఖైరతాబాద్, నాంపల్లి, ఎల్‌బినగర్, మూసారాంబాగ్, పెరెడ్ గ్రౌండ్స్, రసూల్‌పురా, నాగోల్, తార్నాక, మెట్టుగూడల్లో నూతనంగా ప్రతిపాదిస్తున్నది.పంజాగుట్ట, ఎర్రమంజిల్‌లో ఈపాటికే మాల్స్‌ను అందుబాటులోకి హెచ్‌ఎంఆర్ ద్వారా అందుబాటులోకి వచ్చినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హెటెక్‌సిటీ మెట్రోస్టేషన్ మైండ్‌స్పేస్, పంజాగుట్ట మైత్రివనం స్టేషన్ ప్రాంతంలోకి వస్తున్నదని అథారిటీ భావన. ప్రపంచ నగరాల్లోనూ రవాణాధారిత అభివృద్ధితో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు అధికంగా వినియోగించుకుంటున్నట్టు అథారిటీ గ్రహించింది.

No comments:

Post a Comment